దేశం ప్రశాంతంగా ఉండటానికి కారణం జవాన్లే: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:05 PM
సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ధైర్యవంతులైన జవాన్లకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జవాన్ల అచంచలమైన ధైర్యం, సాటిలేని క్రమశిక్షణ, నిస్వార్థ సేవ భారతదేశ అంతర్గత భద్రతకు ఒక శాశ్వతమైన స్తంభంగా నిలిచాయని కొనియాడారు.
అమరావతి, జులై 27: సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ధైర్యవంతులైన జవాన్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దేశం చూసే ప్రతి శాంతియుత సూర్యోదయం.. చీకటి వేళల్లోనూ మెలకువగా ఉండే జవాన్ల ధైర్యంతో భద్రంగా ఉందన్నారు. వారి అచంచలమైన ధైర్యం, సాటిలేని క్రమశిక్షణ, నిస్వార్థ సేవ భారతదేశ అంతర్గత భద్రతకు ఒక శాశ్వతమైన స్తంభంగా నిలిచాయని కొనియాడారు.
ఉగ్రవాదంతో పోరాడటంలో, వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో, ప్రజాస్వామ్య సంస్థలను పరిరక్షించడంలో, ప్రకృతి వైపరీత్యాలకు స్పందించడంలో, లేదా సంక్షోభ సమయాల్లో పౌరులను రక్షించడంలో అయినా సీఆర్పీఎఫ్ ఎల్లప్పుడూ అసాధారణ శౌర్యంతో దేశం పట్ల అచంచలమైన నిబద్ధతతో ముందు వరుసలో నిలిచిందని చెప్పుకొచ్చారు. ప్రతి యూనిఫాం త్యాగానికి ప్రతీక అని.. ప్రతి మిషన్ స్వార్థానికి అతీతమైన కర్తవ్యాన్ని ప్రతిబింబిస్తోందని, ప్రతి ధైర్యసాహసాల చర్య దేశ విశ్వాసాన్ని, ఐక్యతను బలపరుస్తోందని అన్నారు. ధైర్యవంతులైన సీఆర్పీఎఫ్ సిబ్బంది కుటుంబాలకు కూడా పవన్ వందనం తెలిపారు. వారి నిశ్శబ్ద త్యాగాలు, స్థిరమైన మద్దతు ప్రతి సీఆర్పీఎఫ్ యోధుని సంకల్పాన్ని బలపరుస్తాయని ఎక్స్‌లో పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
ఘనంగా శాకంబరీ ఉత్సవాలు.. వివిధ రకాల పండ్లు, కూరగాయలతో దుర్గమ్మ దర్శనం
దయచేసి వైసీపీ ట్రాప్‌లో పడొద్దు.. చంద్రబాబు ఉంటేనే ఏపీకి భవిష్యత్తు: బుద్దా వెంకన్న
Read Latest AP News And Telugu News