Share News

సీఆర్‌ పాటిల్‌తో చంద్రబాబు భేటీ.. గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై కీలక చర్చ

ABN , Publish Date - Jul 22 , 2026 | 03:40 PM

ఢిల్లీ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.

సీఆర్‌ పాటిల్‌తో చంద్రబాబు భేటీ.. గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై కీలక చర్చ
CM Chandrababu

న్యూఢిల్లీ, జులై 22: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. గోదావరి - కావేరీ నదుల అనుసంధానంపై కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. గోదావరి - కావేరీ అనుసంధానంపై భాగస్వామ్య రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి సీఎం విజ్ఞప్తి చేశారు.


శ్రీశైలం నుంచి కావేరీ అనుసంధానం కన్నా బనకచర్ల నుంచి కావేరీ అనుసంధానం మంచిదని కేంద్ర జల్‌శక్తి శాఖ సూచించినట్లు తెలుస్తోంది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జల్‌శక్తి శాఖ.. అన్ని రాష్ట్రాలు, భాగస్వామ్య పక్షాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. సముద్రంలోకి నీరు పోవడం కంటే.. ఉపయోగంలోకి వస్తే బాగుంటుందని కేంద్ర జల్‌శక్తి మంత్రికి సీఎం సూచించారు. అన్ని రాష్ట్రాలను ఒప్పిస్తే కేంద్ర ప్రతిపాదనతో తనకు అభ్యంతరం లేదని.. అందుకోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరగా.. ఇందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ అంగీకరించినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి రండి.. ప్రధానికి సీఎం చంద్రబాబు ఆహ్వానం

అమరావతి అభివృద్ధిలో రైతుల సహకారం కీలకం: మంత్రి నారాయణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 22 , 2026 | 04:02 PM