Share News

2024 ఖరీఫ్ పంటల బీమా బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Jul 25 , 2026 | 03:13 PM

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో మంత్రి అచ్చెన్నాయుడు జరిపిన సంప్రదింపులు ఫలించాయి. 2024 ఖరీఫ్ పంటల బీమా పెండింగ్ బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది.

2024 ఖరీఫ్ పంటల బీమా బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Minister Atchannaidu

అమరావతి, జులై 25: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో మంత్రి అచ్చెన్నాయుడు జరిపిన సంప్రదింపులు ఫలించాయి. 2024 ఖరీఫ్ పంటల బీమా పెండింగ్ బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న 2024 - ఖరీఫ్ పంటల బీమా బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెండింగ్ బీమా నగదు.. రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చర్యలు చేపట్టాయి.


గత ప్రభుత్వ వైఫల్యాలతో వ్యవసాయ శాఖలో పేరుకుపోయిన సమస్యలకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందేలా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. రైతుల పక్షాన స్పందించి బీమా బకాయిల విడుదలకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి...

హోం మంత్రి అనిత ‘ఎక్స్‌’ అకౌంట్ హ్యాక్.. అధికారుల అలర్ట్

గుంతకల్‌-బళ్లారి 3, 4 రైల్వే లైన్లకు ఆమోదంపై సీఎం చంద్రబాబు హర్షం

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2026 | 03:28 PM