Share News

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌గా AVSSN రాజు

ABN , Publish Date - Mar 11 , 2026 | 09:43 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు చైర్మన్‌తో పాటు సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈమేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌గా AVSSN రాజు
APSCPCR

అమరావతి, మార్చి 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) కు చైర్మన్‌తో పాటు సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈమేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్‌గా వెటుకూరి ఏవీఎస్‌ఎస్‌ఎన్ రాజు నియమితులయ్యారు.


బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులుగా చల్లా మధుసూదన్ రావు, కె.జి. వెంకట పద్మలత, దొని శ్రీనివాస మూర్తి, వుండవల్లి గాంధీ బాబు, మండల గంగా సూర్యనారాయణ, ఎం. భవరాజు పద్మావతిలను ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్ చైర్మన్, సభ్యులు పదవీ స్వీకరణ చేసిన తేదీ నుంచి మూడు సంవత్సరాల పాటు లేదా చైర్మన్‌కు 65 ఏళ్లు, సభ్యులకు 60 ఏళ్లు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు.


ఇవి కూడా చదవండి:

గ్యాస్ కొరతతో హోటల్స్‌ అసోసియేషన్‌ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

బుల్లెట్ వేగంతో నడుస్తున్న డబుల్ ఇంజన్ సర్కార్: దేవినేని ఉమా

Updated Date - Mar 11 , 2026 | 09:55 PM