Share News

తీరం దాటిన ఆర్నబ్ తుఫాన్.. ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన

ABN , Publish Date - Oct 28 , 2026 | 11:08 AM

ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తోన్న ఆర్నబ్ తుఫాన్ తీరాన్ని దాటింది. యానాంకు నైరుతి దిశలో నరసాపురానికి సమీపంలో తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

తీరం దాటిన ఆర్నబ్ తుఫాన్.. ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
Arnab Cyclone

అమరావతి, అక్టోబర్ 28: ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తోన్న ఆర్నబ్ అతి తీవ్ర తుఫాన్ తీరాన్ని దాటింది. యానాంకు నైరుతి దిశలో నరసాపురానికి సమీపంలో తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుఫాన్‌.. తీవ్ర తుఫాన్‌గా బలహీనపడినట్లు పేర్కొంది. తుఫాన్ ప్రభావంతో ఉత్తరకోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు కూడా సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆర్నబ్ తుఫాన్ తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.


ఏపీపై తుఫాన్ ప్రభావం.. పలు జిల్లాలో భారీ వర్షపాతం

ఏపీపై ఆర్నబ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. దాదాపు 36 ప్రాంతాల్లో 143 చోట్ల అత్యంత భారీ వర్షాలు, 205 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

  • కన్నూరుపాలెం (అనకాపల్లి) - 26.1సెం.మీ. వర్షపాతం

  • భోగాపురం (విజయనగరం) - 25.9సెం.మీ. వర్షపాతం

  • ముడసర్లోవ (విశాఖ) - 25.9 సెం.మీ. వర్షపాతం

  • తాడి (అనకాపల్లి) - 24.5 సెం.మీ. వర్షపాతం

  • పరవాడ (అనకాపల్లి) - 24.5 సెం.మీ. వర్షపాతం

  • సోమలింగంపాలెం (అనకాపల్లి) - 23.9 సెం.మీ. వర్షపాతం

  • అచ్యుతాపురం (అనకాపల్లి) - 23.9 సెం.మీ. వర్షపాతం

  • సింహాచలం (విశాఖ) - 23.6 సెం.మీ. వర్షపాతం

  • చామలపల్లె (విశాఖ)-23.5 సెం.మీ. వర్షపాతం

  • వేపాడ (విజయనగరం) - 22.7 సెం.మీ. వర్షపాతం

  • పద్మనాభపురం (విశాఖ) - 22.5 సెం.మీ. వర్షపాతం

  • దేశపాత్రునిపాలెం (అనకాపల్లి) - 22.4 సెం.మీ. వర్షపాతం

  • కొత్తవలస (విజయనగరం) - 22.3 సెం.మీ. వర్షపాతం

  • అచ్చుతాపురం, కొత్తవలసలో 22 సెం.మీ. వర్షపాతం


ఇవి కూడా చదవండి...

తుఫాన్‌పై వెనిగండ్ల రాము సమీక్ష.. స్వయంగా కారు నడుపుతూ గుడివాడలో పర్యటన

ఆర్నబ్ తుఫాన్‌.. మునిసిపల్ కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశాలివే

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 11:29 AM