తుఫాన్‌పై వెనిగండ్ల రాము సమీక్ష.. స్వయంగా కారు నడుపుతూ గుడివాడలో పర్యటన
ABN , Publish Date - Oct 28 , 2026 | 10:44 AM
తుఫాన్ నేపథ్యంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అప్రమత్తమయ్యారు. తుఫాన్ పరిస్థితిపై కూటమి నాయకత్వంతో గ్రూప్ కాల్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
కృష్ణా జిల్లా, అక్టోబర్ 28: తుఫాన్ నేపథ్యంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అప్రమత్తమయ్యారు. తుఫాన్ పరిస్థితిపై కూటమి నాయకత్వంతో గ్రూప్ కాల్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అనంతరం స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ పట్టణంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఏలూరు రోడ్, బస్టాండ్, మార్కెట్ సెంటర్, జైన్ స్ట్రీట్, RDO ఆఫీస్ రోడ్, కొత్తపేటలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. రోడ్లపై కూలిన చెట్ల తొలగింపు పనులను పరిశీలించారు. పట్టణంలో 80 శాతం చెట్ల తొలగింపు పూర్తి అయ్యింది. దీంతో మున్సిపల్ యంత్రాంగం పనితీరును ఎమ్మెల్యే అభినందించారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని.. బైక్‌లపై తిరగవద్దని ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు. పార్టీ నేతలు ప్రజలతో టచ్‌లో ఉండాలని ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని.. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
ఆర్నబ్ తుఫాన్‌తో రైతులకు తీవ్ర నష్టం.. బాధితులను ఆదుకుంటాం: సానా సతీష్
పెద్దేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదల.. అనకాపల్లి జిల్లా ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి
Read Latest AP News And Telugu News