Share News

అక్వాన్ తుపాను ఎఫెక్ట్.. ఎన్టీఆర్ జిల్లాలో విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ABN , Publish Date - Nov 17 , 2026 | 05:38 PM

అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఏపీసీపీడీసీఎల్ అప్రమత్తమైంది. భారీ వర్షాలు, బలమైన గాలుల దృష్ట్యా విద్యుత్ సరఫరా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశించారు.

అక్వాన్ తుపాను ఎఫెక్ట్.. ఎన్టీఆర్ జిల్లాలో విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

విజయవాడ, నవంబర్17: అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఏపీసీపీడీసీఎల్ అప్రమత్తమైంది. భారీ వర్షాలు, బలమైన గాలుల దృష్ట్యా విద్యుత్ సరఫరా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశించారు. ప్రజలకు నిరంతర విద్యుత్ సేవలు అందించేందుకు ఎన్టీఆర్ సర్కిల్ పరిధిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు చేసినట్లు వివరించారు. అత్యవసర కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు..1912, 9440817561 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


విద్యుత్ అంతరాయాలు, ప్రమాదాలపై సమాచారం అందించేందుకు ఈ నంబర్లు అందుబాటులో ఉంచినట్లు సీఎండీ పుల్లారెడ్డి చెప్పారు. అంతరాయం తలెత్తితే వెంటనే స్పందించి.. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సిబ్బందికి సీఎండీ దిశానిర్దేశం చేశారు. తుపాను సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ విజ్ఞప్తి చేశారు. తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకొరిగిన స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాక వద్దని హెచ్చరించారు. విద్యుత్ ప్రమాదాలు సంభవించే ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సీఎండీ పుల్లారెడ్డి సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్వాన్ తుపాను.. ఏపీ, ఒడిశాలకు ఆరెంజ్ అలర్ట్: వాతావరణ శాఖ

సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏది? కాంగ్రెస్‌కు కేటీఆర్ ప్రశ్న

Updated Date - Nov 17 , 2026 | 05:52 PM