Share News

యువతకు సినీ, ఏఐ రంగాల్లో కొత్త అవకాశాలు.. మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

ABN , Publish Date - Jun 25 , 2026 | 04:17 PM

నవ్యాంధ్రలో సరికొత్త ‘క్రియేటివ్ ఎకానమీ విప్లవం’కు శ్రీకారం చుట్టనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. యువతకు ఆధునిక సినీ సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

యువతకు సినీ, ఏఐ రంగాల్లో కొత్త అవకాశాలు.. మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన
Minister Kandula Durgesh

అమరావతి, జూన్ 25: నవ్యాంధ్రలో సరికొత్త ‘క్రియేటివ్ ఎకానమీ విప్లవం’కు శ్రీకారం చుట్టనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈరోజు(గురువారం) రాష్ట్ర సచివాలయంలో మంత్రిని జాడెక్స్ ఇన్నోవిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు కలిసి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని స్థానిక యువత ప్రతిభను ప్రోత్సాహించడంతో పాటు.. యువతకు ఆధునిక సినీ సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.


జులై నెలలో మెగా ఫిల్మ్ వర్క్‌షాప్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. సినీ పరిశ్రమకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్‌పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఏఐ ఆధారిత ఫిల్మ్ మేకింగ్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. 24 క్రాఫ్ట్స్ శిక్షణకు సంబంధించి జాడెక్స్ సంస్థ రూపొందించిన యాక్షన్ ప్లాన్‌పై సమావేశంలో సమగ్రంగా చర్చించినట్లు మంత్రి తెలిపారు. యువతకు ప్రపంచ స్థాయి ఫిల్మ్ మేకింగ్‌పై అవగాహన కల్పిస్తామన్నారు. సినీ, మీడియా రంగాల్లో కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో క్రియేటివ్ ఎకానమీ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

దేవినేని నెహ్రూ లేకపోతే నువ్వు ఆఫ్ట్రాల్.. అవినాష్‌పై పట్టాభి ఫైర్

విజయవాడలో టీడీపీ జెండా దిమ్మె కూల్చివేత ఘటన.. వైసీపీ నేత అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 25 , 2026 | 05:03 PM