Share News

ఏపీలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం

ABN , Publish Date - May 06 , 2026 | 03:46 PM

ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 17వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది.

ఏపీలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం
AP Investments

అమరావతి, మే 6: రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(SIPB) ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 17వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు 39 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. విశాఖపట్నంలో రిలయన్స్ సంస్థ రూ.1 లక్ష కోట్లతో భారీ డేటా సెంటర్‌‌ను ఏర్పాటు చేయనుంది.


సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. కడపలో అదానీ సంస్థ రూ.12 వేల కోట్లతో హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును చేపట్టనుంది. తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ రూ.2,500 కోట్లతో మోటర్ సైకిల్ తయారీ పరిశ్రమను స్థాపించనుంది. ఈ ప్రాజెక్టులకు నిర్దేశిత గడువుకు ముందే అనుమతులతో ఓ బ్రాండ్ సృష్టిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

శ్రీసత్యసాయి జిల్లాలో హైవే దోపిడీ కేసులు.. ఏడుగురి అరెస్ట్

అభివృద్ధిని అడ్డుకుంటే తొక్కిపడేస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

Read Latest AP News And Telugu News

Updated Date - May 06 , 2026 | 04:05 PM