రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రోత్సాహం: మంత్రి గొట్టిపాటి రవికుమార్
ABN , Publish Date - Aug 04 , 2026 | 04:53 PM
విద్యుత్ రంగంపై ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పవర్ సెక్టార్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేశామన్నారు.
అమరావతి, ఆగస్టు 4: విద్యుత్ రంగంపై ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పవర్ సెక్టార్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేశామన్నారు. వైసీపీ హయాంలో విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యం చేశారని విమర్శించారు. అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు వల్ల నష్టాలు జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టామని తెలిపారు. గత ఏడాది కొంత మేర విద్యుత్ ఛార్జీలు తగ్గించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటు కొనసాగుతోందని వెల్లడించారు.
సౌర విద్యుత్ ద్వారా లక్షలాది కనెక్షన్ల లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు. రైతులకు పెద్ద ఎత్తున వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నామని చెప్పారు. భారీగా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. ట్రాన్స్‌మిషన్ లైన్ల విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజల నుంచి వినతులు వచ్చాయని.. రెవెన్యూ, భూ, విద్యుత్, పెన్షన్ సమస్యలపై వినతులను స్వీకరించామన్నారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు, ఎస్పీలతో సమన్వయం చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అందిన అర్జీలన్నింటినీ త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
ప్రజల్లో సైలెంట్ రివల్యూషన్.. 2024లో ఊహించని విజయం: సీఎం చంద్రబాబు
‘జగన్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వండి’.. తాడేపల్లిలో బోరుగడ్డ అనిల్ నిరసన
Read Latest AP News And Telugu News