విద్యుత్ శాఖలో సంస్కరణలు తెచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు: మంత్రి గొట్టిపాటి
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:13 PM
ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈరోజు 25 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేసినట్లు తెలిపారు.
విజయవాడ, సెప్టెంబర్ 16: ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈరోజు 25 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని విభాగాలలో కలిపి ఇప్పటి వరకు 359 ఉద్యోగాలను కల్పించామని చెప్పారు. స్పెషల్ కేసు కింద 35 మందిని నియమించామని వెల్లడించారు. రాత్రి, పగలూ పనిచేసే విద్యుత్ శాఖలో సిబ్బంది భద్రత కూడా ముఖ్యమని అన్నారు.
దేశం మొత్తం మీద విద్యుత్ సంస్కరణలు తెచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరు లక్షల మంది ఎస్సీ, ఎస్టీలకు సూర్యఘర్ కింద సోలార్ పవర్‌ను అందజేశామని వెల్లడించారు. ఈరోజు ఉద్యోగ నియామక పత్రాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభినందనలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
ఆ ఇద్దరూ కలిసి మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తారు: మంత్రి శ్రీధర్ బాబు
యువ క్రీడాకారులకు జ్యోతి యర్రాజీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News