సోమువీర్రాజుపైకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు.. మండలిలో ఉద్రిక్త వాతావరణం
ABN , Publish Date - Feb 26 , 2026 | 11:51 AM
ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మీదకు వైసీపీ ఎమ్మెల్సీలు దూసుకెళ్లారు.
అమరావతి, ఫిబ్రవరి 26: ఏపీ శాసనమండలిలో (AP Legislative Council) గురువారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రాయలసీమ లిఫ్ట్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) సమాధానం ఇచ్చిన తర్వాత కూడా చర్చకు అవకాశం కల్పించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. సమాధానం పూర్తయినందున తర్వాతి ప్రశ్నకు ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అవకాశం ఇచ్చారు. ఛైర్మన్ అవకాశం కల్పించడంతో తర్వాతి ప్రశ్న లేవనెత్తిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఛైర్మన్ తీరుకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్‌తో పాటు మరికొందరు సభ్యులు సోము వీర్రాజు వైపుకు దూసుకెళ్లారు. ‘మేము నిరసన తెలుపుతుంటే మైక్ ఎందుకు తీసుకున్నావ్?’ అంటూ ఇజ్రాయిల్.. సోము వీర్రాజు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఇతర వైసీపీ సభ్యులు కూడా ఇజ్రాయిల్‌ను అనుసరించారు. ఈ ఘటనతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సమయంలో సోము వీర్రాజుకు మద్దతుగా మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్ ముందుకు వచ్చి వైసీపీ సభ్యులను అడ్డుకున్నారు. సభలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ఛైర్మన్ మోషేన్ రాజు సభను మూడోసారి వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి...
మండలిలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ.. గందరగోళం
తెలంగాణలో 45 మంది ఐఏఎస్‌ల బదిలీ
Read Latest AP News And Telugu News