APHEFRMC సభ్యుల నియామకం.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ABN , Publish Date - Jul 15 , 2026 | 03:41 PM
ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ(APHEFRMC) సభ్యుల నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫీజు రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ చట్టం-2019 ప్రకారం ఈ నియామకాలను చేపట్టింది.
అమరావతి, జులై 15: ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ(APHEFRMC) సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫీజు రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ చట్టం-2019 ప్రకారం ఈ నియామకాలను చేపట్టింది. కమిటీ సభ్యుల పదవీకాలం మూడు సంవత్సరాలు లేదా 70 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. వీటిలో ఏది ముందుగా వస్తే అది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
చార్టర్డ్ అకౌంటెంట్/పబ్లిక్ ఫైనాన్స్ నిపుణుడిగా తిరుమలశెట్టి వెంకట రంగ సత్య భానుమూర్తిని కమిటీ సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ విభాగం సభ్యులుగా డా. మన్యాల రామలింగ రాజు, పూజారి హరి ప్రకాష్‌లను నియమించింది. ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల ప్రతినిధిగా వీవీఐటీ యూనివర్సిటీ చాన్స్‌లర్ డా.వాసిరెడ్డి విద్యాసాగర్‌ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి...
కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు
జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News