ఒమన్‌లో చిక్కుకున్న మహిళకు ఏపీ ప్రభుత్వం అండ
ABN , Publish Date - May 04 , 2026 | 10:53 AM
ఒమన్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా మహిళకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. వయలపాడు గ్రామానికి చెందిన దూదేకుల షహ్నాజ్‌ను ఉద్యోగం పేరుతో ఏజెంట్ కార్యాలయం నిర్బంధించింది.
అమరావతి, మే 4: ఒమన్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా మహిళకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. వయలపాడు గ్రామానికి చెందిన దూదేకుల షహ్నాజ్‌ను ఉద్యోగం పేరుతో నిర్బంధించిన ఏజెంట్ కార్యాలయం.. ఖర్చుల పేరుతో రూ.2 లక్షలు డిమాండ్ చేసింది. గతేడాది నవంబర్‌లో ఉద్యోగం కోసం షహ్నాజ్ మస్కట్ వెళ్లింది. అక్కడ ఉద్యోగం నచ్చక తిరిగి స్వదేశానికి రావాలని నిర్ణయించుకుంది. ఏజెంట్లు ఆమె ఫోన్ స్వాధీనం చేసుకుని, ఖర్చుల పేరుతో డబ్బులు డిమాండ్ చేయడంతో షహ్నాజ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ విషయంపై ఏపీఎన్‌ఆర్టీ సొసైటీకి షహ్నాజ్ భర్త అబూబకర్ ఫిర్యాదు చేశారు.
ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించి.. ఏపీఎన్‌ఆర్టీ సొసైటీ సహాయంతో ఒమన్‌లోని భారతీయ ఎంబసీకి లేఖ రాయించింది. పోలీసుల జోక్యంతో ఏజెంట్లతో చర్చలు జరుపగా.. ఖర్చులు భరించి షహ్నాజ్‌ను తిరిగి స్వదేశం పంపేందుకు ఏజెంట్లు అంగీకరించారు. మే 7వ తేదీన షహ్నాజ్ స్వదేశానికి చేరుకోనున్నట్లు సమాచారం. వలస కార్మికుల భద్రత, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. షహ్నాజ్ విషయంలో ఏపీఎన్‌ఆర్టీ సొసైటీ చొరవను సీఎం అభినందించారు.
ఇవి కూడా చదవండి...
సనాతన ధర్మానికి వైసీపీ వ్యతిరేకం
ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు జన్మదిన శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News