Share News

సనాతన ధర్మానికి వైసీపీ వ్యతిరేకం

ABN , Publish Date - May 04 , 2026 | 05:13 AM

సనాతన ధర్మానికి, హిందూ మత ప్రచారానికి, ధార్మిక సంస్థల ఆలోచనలకు వ్యతిరేకంగా గత వైసీపీ ప్రభుత్వం పనిచేసిందని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు.

సనాతన ధర్మానికి వైసీపీ వ్యతిరేకం

  • ఐదేళ్లలో ఆలయాలకు సున్నం కూడా వేయలేదు: మంత్రి ఆనం

ఉలవపాడు, మే 3(ఆంధ్రజ్యోతి): సనాతన ధర్మానికి, హిందూ మత ప్రచారానికి, ధార్మిక సంస్థల ఆలోచనలకు వ్యతిరేకంగా గత వైసీపీ ప్రభుత్వం పనిచేసిందని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. ఐదేళ్ల పాలనలో ఏనాడూ హిందువుల మనోభావాలకు అభీష్టంగా పనిచేసిన దాఖలాలు లేవన్నారు. ప్రకాశం జిల్లా ఉలవపాడులోని వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన రథోత్సవాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. నూతన రథానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని ఆలయాలకు సున్నం కూడా వేసిన పరిస్థితి లేదన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని, టీటీడీ సహకారంతో 5,000 నూతన ఆలయాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. వచ్చే రెండేళ్లలో 800 ఆలయాల పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్నారు. రూ.50 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులు, అర్చకులకు ప్రతినెలా రూ.10,000 దేవదాయశాఖ చెల్లిస్తోందని చెప్పారు.

Updated Date - May 04 , 2026 | 05:14 AM