Share News

ఇంధన సరఫరాపై పెట్రోలియం డీలర్స్‌తో అధికారుల చర్చలు

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:31 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఇంధన సరఫరాపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్‍తో అధికారులు ఫోన్‌లో చర్చలు జరిపారు. తక్షణం స్టాక్ లేని బంకుల వివరాలు అందించాలని అధికారులు ఆదేశించారు.

ఇంధన సరఫరాపై పెట్రోలియం డీలర్స్‌తో అధికారుల చర్చలు
AP Fuel Supply

అమరావతి, ఏప్రిల్ 25: ఏపీలో ఇంధన కొరత లేకుండా చూడాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో వెంటనే స్పందించిన అధికారులు.. ఇంధన సరఫరాపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్‍తో ఫోన్‌లో చర్చలు జరిపారు. తక్షణం స్టాక్ లేని బంకుల వివరాలు అందించాలని అధికారులు ఆదేశించారు. దీంతో జిల్లాల అధ్యక్షులకు రాష్ట్ర డీలర్ల అసోసియేషన్ సమాచారం పంపించింది. స్టాక్ సమస్య ఉంటే తక్షణం టోల్‍ఫ్రీ నం.1967కు కాల్ చేయాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ సూచించారు. టోల్‍ఫ్రీకి ఫోన్ చేసి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.


గత ఏప్రిల్ కంటే పదిశాతం అదనపు సరఫరాకు ఆయిల్ కంపెనీలు అంగీకారం తెలిపాయి. పెట్రోల్ డీలర్ల నుంచి ఏపీఎఫ్‍పీటీ అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ వివరాలు సేకరిస్తున్నారు. ఆయిల్ కంపెనీల సరఫరా తీరుపై క్షేత్రస్థాయి నివేదిక సమర్పణకు చర్యలు చేపట్టారు. పౌరసరఫరాలశాఖ కమిషనర్‌‌కు నివేదిక సమర్పించేందుకు అసోసియేషన్ ప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

రాత్రంతా పోలీసుల విచారణ.. సహకరించని అనంతబాబు

ఏపీలో పెట్రోల్‌ బంకుల మూసివేతపై సీఎం చంద్రబాబు సమీక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 25 , 2026 | 12:45 PM