అనాథ పిల్లలకూ ‘తల్లికి వందనం’ పథకం.. మంత్రి లోకేశ్ ఆదేశం
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:49 PM
పీఎంశ్రీ నిధుల వినియోగంలో దేశంలోనే నంబర్-1గా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పీఎంశ్రీ పథకంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన అధికారులకు అభినందనలు తెలియజేశారు.
అమరావతి, జూన్ 18: పీఎంశ్రీ నిధుల వినియోగంలో దేశంలోనే నంబర్-1గా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పీఎంశ్రీ పథకంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఈరోజు(గురువారం) విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. మెగా పీటీఎం నాటికి విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీని పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. 430 కేజీబీవీల్లో 1.06 లక్షల మంది బాలికలకు బంక్ బెడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. 53,180 బంక్ బెడ్స్ ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టాలని లోకేశ్ ఆదేశించారు.
ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లో కూడా బంక్ బెడ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2.03 లక్షల మంది విద్యార్థులకు కిట్ల పంపిణీ చేయాలన్నారు. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూళ్ల అనుమతుల్లో అనవసర నిబంధనలు తొలగించాలని సూచించారు. ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను బోర్డులపై, పబ్లిక్ డొమైన్‌లో తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేశారు. అనాథ పిల్లలకు కూడా ‘తల్లికి వందనం’ పథకం ప్రయోజనాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. గార్డియన్లు లేని పిల్లలకు జిల్లా కలెక్టర్ ద్వారా నిధుల పంపిణీపై దృష్టి సారించాలన్నారు. అనాథ పిల్లల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేసే విధానంపై ఆలోచన చేయాలన్నారు.
తెలుగు అకాడమీ పుస్తకాలు త్వరలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయని లోకేశ్ వెల్లడించారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా తెలుగు అకాడమీ పుస్తకాల విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, హాజరు పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కర్నూలు, అనంతపురం, మార్కాపురం, అల్లూరి, పోలవరం ప్రాంతాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల హాజరు 95 శాతానికి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని నాణ్యతతో, పారదర్శకంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మ్యాథ్స్, సైన్స్, తెలుగులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. మాతృభాష తెలుగును విస్మరించొద్దని ఉపాధ్యాయులకు మంత్రి సూచనలు చేశారు. బ్రిడ్జ్ కోర్సు మెటీరియల్ సిద్ధం చేసి విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు. హైస్కూల్ విద్యార్థులకు క్రోమ్ బుక్స్‌తో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గాయత్రి మృతి కేసు.. అల్లుడిపైనే తల్లి అనుమానాలు
అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న కృష్ణా జిల్లా: మంత్రి వాసంశెట్టి సుభాష్
Read Latest AP News And Telugu News