Share News

ఆకాశవాణికి 90 ఏళ్లు పూర్తి.. ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు..

ABN , Publish Date - May 09 , 2026 | 12:31 PM

ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో గళం సెల్‌ ద్వారా యువత, విద్యార్థులు, శ్రోతలను ఆకాశవాణి భాగస్వామ్యం చేయనుంది.

ఆకాశవాణికి 90 ఏళ్లు పూర్తి.. ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు..
All India Radio Station

విజయవాడ: ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో- AIR) 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో గళం సెల్‌ ద్వారా యువత, విద్యార్థులు, శ్రోతలను ఆకాశవాణి భాగస్వామ్యం చేయనుంది. ఈ మేరకు ఈనెల 10వ తేదీన సాయంత్రం 6 గంటలకు విజయవాడలో భారీఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను అధికారులు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా స్థానిక కళాకారులను ప్రోత్సాహించేందుకు నిర్ణయించారు.


ఈ మేరకు ప్రతి పోటీలో రూ.500 బహుమతిగా ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యువజన గానం, శ్రీ వేంపులేటి అయ్యప్పస్వామి బృందం గరగ నృత్య ప్రదర్శనలు ప్రత్యేకంగా ఉండనున్నాయి. వివిధ పోటీల్లో సుమారు 400 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలను కూడా ప్రదానం చేయనున్నారు. కాగా, గత ఆరేళ్లుగా పోటీల్లో పాల్గొని ఆకాశవాణి అభిమానులు ప్రతిభ చాటుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

విశాఖ కైలాసగిరిపై భారీ త్రిశూలం ప్రారంభం

విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి లోకేశ్

Updated Date - May 09 , 2026 | 12:39 PM