Share News

కడప జిల్లాలో టీడీపీ నేతపై వైసీపీ శ్రేణుల రాళ్ల దాడి.. తీవ్ర గాయాలు

ABN , Publish Date - Nov 22 , 2026 | 12:43 PM

పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకుంటుంది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో పలువురు తీవ్రంగా గాయపడుతున్నారు.

కడప జిల్లాలో టీడీపీ నేతపై వైసీపీ శ్రేణుల రాళ్ల దాడి.. తీవ్ర గాయాలు

కడప, నవంబర్ 22: పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకుంటుంది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో పలువురు తీవ్రంగా గాయపడుతున్నారు. ఆదివారం మైదుకూరు నియోజకవర్గం.. కాజీపేట మండలం బి కొత్తపల్లిలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య.. వాగ్వివాదం చోటు చేసుకుంది. అది కాస్తా తీవ్ర ఘర్షణగా మారింది. దీంతో టీడీపీ నేత రఘురామిరెడ్డిపై వైసీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి.


ఈ దాడిలో రఘురామిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరో రెండు తుఫాన్ల ముప్పు!

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 01:01 PM