మదనపల్లిలో హత్యకు గురైన చిన్నారి అంత్యక్రియలు పూర్తి
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:18 PM
మదనపల్లిలో దారుణ హత్యకు గురైన ఏడేళ్ల బాలిక అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. చిన్నారికి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు.
కడప, ఫిబ్రవరి 18: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణ హత్యకు గురైన బాలిక అంత్యక్రియలు కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి. మదనపల్లిలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ హత్యకు గురైన బాలిక అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన కడప జిల్లా వీరబల్లి మండలం రాగిమానుదిన్నెపల్లిలో నిర్వహించారు. అంత్యక్రియలకు బంధువులు, స్థానికులు, అన్నమయ్య, కడప జిల్లాల టీడీపీ నేతలు హాజరయ్యారు. అందరూ కన్నీటితో బాలికకు చివరి వీడ్కోలు పలికారు.
అంత్యక్రియలకు ముందే, ఈ కేసులో నిందితుడు కులవర్ధన్ మృతిచెందాడు. అన్నమయ్య జిల్లా కరసానివారిపల్లి చెరువులో అతడి మృతదేహం లభించింది. స్థానికుల సమాచారంతో ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు దీనిని ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. బాలిక అంత్యక్రియలకు ముందే నిందితుడు కులవర్ధన్ మరణంపై మృతురాలి బంధువులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
వైసీపీ వాయిదా తీర్మానాల తిరస్కరణ.. సభలో గందరగోళం
ఏపీ అసెంబ్లీ.. రోడ్ల విస్తరణలో చెట్ల తొలగింపుపై మంత్రి జనార్దన్ సమాధానం
Read Latest AP News And Telugu News