ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణం
ABN , Publish Date - Mar 13 , 2026 | 11:22 AM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర చరిత్రలో తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులై ఆమె రికార్డు నెలకొల్పారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్(Justice Lisa Gill) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ఆవరణలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు పంజాబ్, హరియాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నుంచి జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వుల మేరకు నేడు ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు సీనియర్ న్యాయవాదులు తదితరులు హాజరయ్యారు.
ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం ఉండగా.. ప్రస్తుతం 33 మంది ఉన్నారు. జస్టిస్ లిసా గిల్ రాకతో ఈ సంఖ్య 34కు పెరిగింది. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ ఏడాది ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఆమె సీజేగా నియమితులు కానున్నారు. దీంతో ఏపీ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డ్ సృష్టించనున్నారు.
ఇవీ చదవండి:
సన్‌రైజర్స్‌లోకి పాక్ క్రికెటర్.. క్లారిటీ ఇచ్చిన యాజమాన్యం
రష్యా చమురు కొనుగోలుకు అమెరికా గ్రీన్ సిగ్నల్