‘షిప్‌బిల్డింగ్’లో గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఆహ్వానం
ABN , Publish Date - Sep 06 , 2026 | 05:36 AM
రాష్ట్రంలో షిప్‌బిల్డింగ్ ప్రాజెక్టుల్లో అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ దాకా జర్మనీలో (గ్లోబల్ షిప్‌బిల్డింగ్ సమ్మిట్)ఎ్‌సఎంఎం హంబర్గ్-2026 పేరిట ప్రపంచ స్థాయి షిప్‌బిల్డింగ్ ఎగ్జిబిషన్ జరిగింది.
జర్మనీలో గ్లోబల్ షిప్‌బిల్డింగ్ సమ్మిట్ హంబర్గ్-2026
కేంద్ర నౌకాయాన శాఖతో కలసి పాల్గొన్న ఏపీ
అమరావతి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో షిప్‌బిల్డింగ్ ప్రాజెక్టుల్లో అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ దాకా జర్మనీలో (గ్లోబల్ షిప్‌బిల్డింగ్ సమ్మిట్)ఎ్‌సఎంఎం హంబర్గ్-2026 పేరిట ప్రపంచ స్థాయి షిప్‌బిల్డింగ్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఎగ్జిబిషన్‌లో కేంద్ర ప్రభుత్వ నౌకాయాన మంత్రిత్వశాఖ అధికారులతో పాటు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మౌలిక సదుపాయాల కల్పనా శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, రాష్ట్ర ఓడరేవుల అభివృద్ధి సంస్థ సీఈవో ప్రవీణ్ ఆదిత్య పాల్గొన్నారు. ఓడరేవుల అభివృద్ధి సంస్థల ప్రతినిధులతోనూ, మారిటైమ్ రంగంలో పెట్టుబడిదారులతోనూ, మారిటైమ్ పరికరాల తయారీ సంస్థల ప్రతినిధులతోనూ, సాంకేతిక పరిజ్ఞానం సరఫరాదారులతోనూ శశిధర్ బృంద సభ్యులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో మారిటైమ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. ఇటలీకి చెందిన ఫిన్‌కాన్‌టీరి, నెథర్లాండ్‌కు చెందిన డమెన్ షిప్‌యార్డ్స్ గ్రూప్‌తో పాటు మరికొన్ని గ్లోబల్ మారిటైమ్ బోర్డు సంస్థల యాజమాన్యాలతో సమావేశమయ్యారు.
ఈ వార్తలను కూడా చదవండి
సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరిగేనా...?