Share News

బొబ్బిలిలో బాలఏసు విగ్రహం కూల్చివేత

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:12 AM

బొబ్బిలి పట్టణంలోని గొల్లవీధి జంక్షన్‌లో గల ఆర్‌సీఎం చర్చి పరిధిలో ఉన్న బాలఏసు విగ్రహా న్ని శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు కూలగొట్టారు.

బొబ్బిలిలో బాలఏసు విగ్రహం కూల్చివేత

బొబ్బిలి, సెప్టెంబ రు 5(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి పట్టణంలోని గొల్లవీధి జంక్షన్‌లో గల ఆర్‌సీఎం చర్చి పరిధిలో ఉన్న బాలఏసు విగ్రహా న్ని శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు కూలగొట్టారు. ఈ విషయాన్ని నైట్‌డ్యూటీలో ఉన్న పోలీసులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో తెల్లవారుజా మున రెండు గంటల సమయంలో డీఎస్పీ రాకోటి గోవిందరావు, సీఐ కింతలి నారాయణరావు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించా రు. ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా అప్రమత్తమై పోలీసు బందోబస్తు నిర్వ హించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో గల అన్ని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. శుక్రవారం రాత్రి 9.50 నుంచి అర్ధరాత్రి వరకు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో సీసీ ఫుటేజీల్లో నమోదు కానట్లు తెలుస్తోంది. విజయనగరం నుం చి క్లూస్‌ టీమ్‌ వచ్చి ఆధారాలను సేకరించింది. డాగ్‌ స్క్వాడ్‌ వచ్చి బాలయేసు విగ్రహం పరిసర ప్రాంతాలను పరిశీలించింది.

సంయమనం పాటించాలి: సీఐ

పాతబొబ్బిలి రోడ్డులోని ఆర్‌సీఎం చర్చిలో సీఐ కింతలి నారాయణరావు శనివా రం ఉదయం మత పెద్దలు, క్రైస్తవులతో సమావేశం నిర్వహించారు. సున్నితమై న ఈ అంశం విషయంలో ఎవరూ కోపోద్రిక్తులు కాకుండా సంయమనం పాటిం చాలని సీఐ కోరారు. విగ్రహాన్ని కూలగొట్టేందుకు పూనుకున్న వారిని పట్టుకొని చట్టానికి అప్పగిస్తామని తెలిపారు. శాంతిభద్రతల సమస్యకు తావు లేకుండా అందరూ సహకరించాలని కోరారు. పోలీసులు విజ్ఞప్తికి మత పెద్దలు సానుకూ లంగా స్పందించి తాము సహకరిస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Sep 06 , 2026 | 12:13 AM