Share News

భర్తను సుత్తితో కొట్టి చంపేసింది!

ABN , Publish Date - Sep 13 , 2026 | 04:35 AM

మద్యం తాగి వేధిస్తున్న భర్తను భార్య సుత్తితో కొట్టి చంపేసింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో జరిగిందీ ఘటన. కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం పట్టణానికి చెందిన రవికుమార్‌(41), హిందూపురం మండలం భరత్‌నగర్‌కు చెందిన శోభ 17 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి హిందూపురంలో కాపురం ఉంటున్నారు.

భర్తను సుత్తితో కొట్టి చంపేసింది!

  • మద్యం తాగి వేధిస్తున్నాడనే..

  • సత్యసాయి జిల్లా హిందూపురంలో ఘటన

హిందూపురం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): మద్యం తాగి వేధిస్తున్న భర్తను భార్య సుత్తితో కొట్టి చంపేసింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో జరిగిందీ ఘటన. కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం పట్టణానికి చెందిన రవికుమార్‌(41), హిందూపురం మండలం భరత్‌నగర్‌కు చెందిన శోభ 17 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి హిందూపురంలో కాపురం ఉంటున్నారు. ఇద్దరూ స్థానిక గార్మెంట్స్‌ పరిశ్రమలో పనిచేస్తున్నారు. రవికుమార్‌ ఇటీవల మద్యానికి బానిసవడంతో దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. వారం రోజులుగా పనికిపోకుండా, నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను వేధిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం కూడా మద్యం తాగి ఇంటికి రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహం చెందిన శోభ సుత్తితో భర్త తలపై కొట్టడంతో కింద పడిపోయాడు. ఆ తర్వాత ఆమె పనికి వెళ్లి, సాయంత్రం వచ్చేసరికి మరణించాడు. వెంటనే మృతదేహాన్ని అతని స్వస్థలం దొడ్డబళ్లాపురానికి తీసుకెళ్లింది. మద్యం తాగి ఇంటికొచ్చే సమయంలో కిందపడి మరణించాడని బంధువులను నమ్మించేందుకు ప్రయత్నించింది. రవికుమార్‌ సోదరి భాగ్యశ్రీ ఫిర్యాదు మేరకు శోభను హిందూపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. జరిగిన విషయం తెలిపింది. దీంతో మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ అబ్దుల్‌ కరీం తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ వైద్యం

‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి

Updated Date - Sep 13 , 2026 | 04:35 AM