Share News

19న సీఎం రాక

ABN , Publish Date - Sep 13 , 2026 | 01:03 AM

నగరంలో సుమారు 30 వేల మంది ఆక్రమణదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేసేందుకు పార్టీ నాయకులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

19న సీఎం రాక

ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారికి పట్టాల పంపిణీ

విశాఖపట్నం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి):

నగరంలో సుమారు 30 వేల మంది ఆక్రమణదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేసేందుకు పార్టీ నాయకులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారిలో కొందరికి 2014-19 మధ్య చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పట్టాలు పంపిణీ చేసి, కన్వేయన్స్‌ డీడ్‌లు ఇచ్చారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మిగిలిన వారికి పట్టాలు పంపిణీ చేయలేదు. 2024లో కూటమి అధికారం చేపట్టిన తరువాత ఆక్రమణల క్రమబద్ధీకరణపై దృష్టిసారించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి మండలాల వారీగా అర్హుల జాబితాను సిద్ధం చేశారు. వారందరికీ ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా పట్టాలు పంపిణీ చేయించనున్నారు. పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహణకు వేదిక ఖరారు చేయడానికి ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి 15వ తేదీన నగరానికి వస్తున్నారు.

Updated Date - Sep 13 , 2026 | 01:03 AM