Share News

ప్రాణం తీసిన మందార పువ్వు

ABN , Publish Date - Sep 01 , 2026 | 06:32 AM

పిల్లల పట్ల ఏమరుపాటుగా ఉంటే ఎన్ని అనర్థాలో ఈ ఉదంతమే నిదర్శనం. మందార పువ్వు రెక్కలు గొంతులో ఇరుక్కుని, ఊపిరాడక ఎనిమిది నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం జంగంరెడ్డిపేటలో చోటుచేసుకుంది.

ప్రాణం తీసిన మందార పువ్వు

  • గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి.. అనంతలో విషాదం

పుట్లూరు, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): పిల్లల పట్ల ఏమరుపాటుగా ఉంటే ఎన్ని అనర్థాలో ఈ ఉదంతమే నిదర్శనం. మందార పువ్వు రెక్కలు గొంతులో ఇరుక్కుని, ఊపిరాడక ఎనిమిది నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం జంగంరెడ్డిపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జూటూరు రవికుమార్‌, కవిత దంపతుల కూతురు సాత్విక ఆదివారం రాత్రి ఇంటిముందు తోటి చిన్నారులతో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో కిందపడిన మందార పువ్వును నోట్లో పెట్టుకుని మింగేసింది. పువ్వు రెక్కలు గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక విలవిలలాడింది. గమనించిన తల్లిదండ్రులు, సాత్వికను వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.


ఇవి కూడా చదవండి

2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..


పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Updated Date - Sep 01 , 2026 | 06:32 AM