హాంగ్యోకు ‘స్వచ్ఛ ఆంధ్ర’ పురస్కారం
ABN , Publish Date - Oct 04 , 2026 | 05:08 AM
దక్షిణ భారత ఐస్‌క్రీం బ్రాండ్‌లలో ఒకటైన హాంగ్యో ఐస్‌క్రీమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తిరుపతి విభాగానికి ప్రతిష్టాత్మక ‘స్వచ్ఛ ఆంధ్ర పురస్కారం 2026’ దక్కింది.
స్వచ్ఛత, పర్యావరణ నిర్వహణకు గుర్తింపు
బెంగళూరు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): దక్షిణ భారత ఐస్‌క్రీం బ్రాండ్‌లలో ఒకటైన హాంగ్యో ఐస్‌క్రీమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తిరుపతి విభాగానికి ప్రతిష్టాత్మక ‘స్వచ్ఛ ఆంధ్ర పురస్కారం 2026’ దక్కింది. గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా హాంగ్యో ఐస్‌క్రీమ్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ దినేశ్ ఆర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రేణిగుంట-తిరుపతి చుట్టుపక్కల పారిశ్రామివాడల్లో స్వచ్ఛత, పర్యావరణ సంరక్షణ, పారిశుధ్య నిర్వహణలో ఉత్తమ కార్యవైఖరికిగాను హాంగ్యో తిరుపతి విభాగం ఈ గౌరవానికి ఎంపికైంది.
ఈ వార్తలనూ చదవండి: