చిన్నారి ప్రాణం తీసిన బెలూన్
ABN , Publish Date - Mar 04 , 2026 | 04:09 PM
ఆడుకునే బెలూన్.. నాలుగేళ్ల చిన్నారి శిరీష ఊపిరి తీసింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
గుంటూరు, మార్చి 04: ఆడుకునే బెలూన్.. నాలుగేళ్ల చిన్నారి శిరీష ఊపిరి తీసింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం చిన్నారి శిరీష బెలూన్‌తో ఆడుకుంటోంది. ఆ బెలూన్‌ను ప్రమాదవశాత్తు ఆ చిన్నారి మింగి వేసింది. అది గొంతుకు అడ్డుపడింది. ఆ వెంటనే బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన పాపను గుంటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అప్పటికే ఆ చిన్నారి మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. ఆ పాప గొంతులోని బెలూన్‌ను వైద్యులు బయటకు తీసి కృత్రిమ శ్వాసను అందించారు. అయినా ఫలితం దక్కలేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి.. తమ కళ్ల ముందే విగత జీవిగా మారిందంటూ శిరీష తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్న ఉన్నతాధికారులు: బాల్క సుమన్
హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News