Share News

టీడీపీ మహానాడు - LIVE Updates

ABN , First Publish Date - May 27 , 2026 | 10:29 AM

టీడీపీ మహానాడు ప్రారంభమైంది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడును ప్రారంభించారు.

టీడీపీ మహానాడు - LIVE Updates

Live News & Updates

  • May 28, 2026 19:35 IST

    అమరావతి: ముగింపు ప్రసంగంలో చంద్రబాబు

    • 1878 క్లస్టర్లలో నేడు మీటింగ్ జరిగింది: చంద్రబాబు

    • ప్రతి ఒర్కరూ ప్రజలతో అనుసంధానం కావాలి: చంద్రబాబు

    • ఏది పోగొట్టుకున్నా సంపాదించుకోవచ్చు.. క్యారెక్టర్ పోతే తిరిగి సంపాదించలేం: చంద్రబాబు

    • నా కార్యకర్త.. నా కుటుంబ సభ్యుడు వెలెత్తి చూపేలా ఉండకూడదు: చంద్రబాబు

    • తొందరలో లోకల్ బాడీస్ వస్తాయ్.. సిధ్దం కావాలి: చంద్రబాబు

  • May 28, 2026 19:33 IST

    అమరావతి: మహానాడు ప్రసంగంలో చంద్రబాబు సంచలన ప్రకటన

    • ఈ మహానాడును ఆడబిడ్డలకు అంకితం చేశాం: చంద్రబాబు

    • ఇప్పటివరకు 17.5 లక్షల మంది ఈ ఒక్కరోజే హైబ్రీడ్‌ మహానాడులో పాల్గొన్నారు: చంద్రబాబు

    • ఇది మహిళా మహానాడు: చంద్రబాబు

  • May 28, 2026 19:21 IST

    అమరావతి: మహానాడుకు రికార్డు స్థాయిలో టీడీపీ కార్యకర్తలు హాజరు

    • హైబ్రీడ్ మహానాడులో పెద్దఎత్తున పాల్గొన్న టీడీపీ శ్రేణులు

    • డిజిటల్ మహానాడులో పాల్గొన్న 24.50 లక్షల మంది కార్యకర్తలు

    • తొలి రోజు 7.50 లక్షలు, రెండో రోజు 17 లక్షల మంది హాజరు

    • ఏపీలో 1,875 క్లస్టర్లల్లో ఏర్పాట్లు, వాడవాడలా టీడీపీ జెండాల రెపరెపలు

    • క్లస్టర్ల వారీగా మహానాడు నిర్వహణతో క్షేత్రస్థాయిలో టీడీపీ సందడి

  • May 28, 2026 19:06 IST

    కార్యకర్తల బీమా కోసం రూ.150 కోట్లు ఖర్చు పెట్టాం: చంద్రబాబు

    • 2047 విజన్ తయారు చేశాం, స్వర్ణాంధ్రగా మార్చాలని ముందుకెళ్తున్నాం: చంద్రబాబు

    • విద్య, వైద్యం, ఉపాధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం: చంద్రబాబు

  • May 28, 2026 18:49 IST

    వర్చువల్‌గా మహానాడు అదరగొట్టింది: చంద్రబాబు

    • వర్చువల్‌గా మహానాడు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది: చంద్రబాబు

    • 16 లక్షల 75 వేల మంది వర్చువల్‌గా మహానాడుకు హాజరు: చంద్రబాబు

    • 18 దేశాల నుంచి ఆన్‌లైన్‌లోకి వచ్చారు: చంద్రబాబు

    • రికార్డు సృష్టించడం, తిరగరాయడం, రికార్డులు బద్దలుకొట్టడం టీడీపీకే సాధ్యం: చంద్రబాబు

  • May 28, 2026 18:17 IST

    సీఎం అంటే చీఫ్‌ మినిస్టర్‌ కాదు.. కామన్‌ మ్యాన్‌: చంద్రబాబు

    • 23 నెలల్లో లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం: చంద్రబాబు

    • ప్రతి సంవత్సరం టార్గెట్‌ పెట్టుకుని పనిచేస్తున్నాం: చంద్రబాబు

    • ఒకప్పుడు పరదాల పాలన.. ఇప్పుడు ప్రజల పాలన: చంద్రబాబు

    • ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరేలా చూస్తున్నాం: చంద్రబాబు

  • May 28, 2026 18:02 IST

    కార్యకర్తల బీమా కోసం రూ.150 కోట్లు ఖర్చు పెట్టాం: చంద్రబాబు

    • 2047 విజన్ తయారు చేశాం, స్వర్ణాంధ్రగా మార్చాలని ముందుకెళ్తున్నాం: సీఎం

    • విద్య, వైద్యం, ఉపాధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం: చంద్రబాబు

  • May 28, 2026 17:58 IST

    వర్చువల్‌గా మహానాడు అదరగొట్టింది: చంద్రబాబు

    • వర్చువల్‌గా మహానాడు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది: చంద్రబాబు

    • 16 లక్షల 75 వేల మంది వర్చువల్‌గా మహానాడుకు హాజరు: చంద్రబాబు

    • 18 దేశాల నుంచి ఆన్‌లైన్‌లోకి వచ్చారు: చంద్రబాబు

    • రికార్డు సృష్టించడం, తిరగరాయడం, రికార్డులు బద్దలుకొట్టడం టీడీపీకే సాధ్యం: చంద్రబాబు

  • May 28, 2026 17:55 IST

    మహానాడు: టీడీపీ కార్యకర్తల పార్టీ: చంద్రబాబు

    • కొందరు నాయకులు వస్తారు.. కుప్పిగంతులు వేస్తారు.. పార్టీని మోసేది మాత్రం కార్యకర్తలే: చంద్రబాబు

    • కార్యకర్తే అధినేత అనేది మహానాడులో కనిపించింది: చంద్రబాబు

    • రెండు రోజులపాటు వర్చువల్‌ మహానాడు అద్భుతంగా జరిగింది: చంద్రబాబు

  • May 28, 2026 17:34 IST

    అమరావతి: విధ్వంసం, విద్వేషం నుంచి వికాసం వైపు ఏపీ పయనం: అచ్చెన్నాయుడు

    • 2019లో ఓ దుర్మార్గుడు పాలన సాగించాక విధ్వంసమనే మాట ఏపీలో విన్నాం: మంత్రి అచ్చెన్న

    • ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం జరుగుతుంది: అచ్చెన్న

    • ఆ ప్రమాదమే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగింది: మంత్రి అచ్చెన్న

  • May 28, 2026 17:23 IST

    ఏపీని ఐటీ హబ్‌గా మార్చిన నాయకుడు చంద్రబాబు: హోంమంత్రి అనిత

    • రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఏపీ నిర్మాణం ప్రారంభమైంది: అనిత

    • దార్శనికత గల నాయకత్వంలో ఆ రోజే అమరావతిని తెచ్చిపెట్టింది: అనిత

    • 2014 నుంచి ఎన్నో సీఎం సంస్కరణలు తీసుకువచ్చారు: హోంమంత్రి అనిత

    • 2019-24 వరకు ఏపీలో విధ్వంస పాలన కొనసాగింది: హోంమంత్రి

    • ప్రజావేదికను కూల్చి పరిపాలన ప్రారంభించారు: హోంమంత్రి అనిత

    • యువగళం వినిపించేందుకు లోకేశ్ యువగళం చేపట్టారు: అనిత

    • జగన్‌ మాదిరిగా గొడ్డళ్లు, కత్తులు చేతపట్టి పాలన సాగించలేదు: అనిత

  • May 28, 2026 17:11 IST

    మంగళగిరి: రెండో రోజు మ‌హానాడులో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు

    • ఇరిగేష‌న్ గురించి మాట్లాడాల్సి వ‌స్తే.. టీడీపీకి ముందు టీడీపీ త‌రువాతే: నిమ్మల

    • ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు మొద‌లెట్టాలో ఎప్పుడు పూర్తిచేయాలో చంద్ర‌బాబు ల‌క్ష్యం పెట్టారు: మంత్రి

  • May 28, 2026 17:05 IST

    ఎన్టీఆర్ జిల్లా: మైలవరం క్లస్టర్-1 మహానాడులో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

    • వైసీపీ, జగన్‌లపై తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్యే వసంత

    • 2029 ఎన్నికలే గొడ్డలి పార్టీకి చివరి ఎన్నికలు: ఎమ్మెల్యే వసంత

  • May 28, 2026 16:09 IST

    విజయనగరం: మహానాడు సందర్భంగా సరదా సందడి చేసిన మంత్రి కొండపల్లి

    • గజపతినగరం మండలం బొండపల్లి మండలం దేవుపల్లిలో జానపద కళాకారులతో కలిసి తప్పెటగుళ్లాడిన మంత్రి కొండపల్లి

  • May 28, 2026 16:03 IST

    మహానాడు కేవలం ఓ పార్టీ సమావేశం కాదు: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

    • ఇది తెలుగు జాతి దశ, దిశా నిర్ణయించే ఒక వేదిక: ఏలూరి సాంబశివ రావు

    • నరేంద్ర మోదీ నినాదం ‘నా దేశం - నా బాధ్యత’ స్పూర్తితో దేశ నిర్మాణంలో ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాల్సిన సమయం ఆసన్నమైంది: ఎమ్మెల్యే

  • May 28, 2026 15:58 IST

    నేను గత మహానాడు లో ఆరు శాసనాలు గురించి చెప్పాను: మంత్రి లోకేశ్

    • ఇప్పుడు నా తెలుగుదేశం.. నా బాధ్యత అని నిర్ణయం తీసుకున్నాం: లోకేశ్

    • ఎవరైనా తన ప్రసంగం ముందు నా తెలుగుదేశం..నా బాధ్యత అని చెప్పాల్సిందే: లోకేశ్

    • జెన్ జీ ఏమి ఆశిస్తుందో.. మనం అలాగే ఆలోచించి ముందుకెళ్లాలి: లోకేశ్

  • May 28, 2026 15:33 IST

    నెల్లూరు: ఆత్మకూరులో వైభవంగా మహానాడు

    • మంత్రి ఆనం కుమార్తె లీలాకైవల్యరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరులో వైభవంగా మహానాడు కార్యక్రమం

    • మహానాడు నిర్వహణలో ఆత్మకూరుకి 3వ స్థానం.

  • May 28, 2026 14:39 IST

    • మహానాడు మరో సంచలన రికార్డు సృష్టించింది: మంత్రి లోకేశ్

    • మహానాడుకు 11లక్షల మందికి పైగా హాజరైయ్యారు: లోకేశ్

    • నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే మహిళా నాయకత్వాన్ని తయారు చేస్తాం: లోకేశ్

    • పార్టీలో ఎప్పటికప్పుడు సంస్కరణలు తీసుకొస్తున్నాం: లోకేశ్

    • ఎన్నికల కోసం కాదు.. సిద్ధాంతపరంగా సంస్కరణలు తీసుకొస్తున్నాం: లోకేశ్

  • May 28, 2026 13:35 IST

    9 నెలల్లోనే ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించారు: బండారు సత్యనారాయణ

  • May 28, 2026 13:31 IST

    తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్: పయ్యావుల కేశవ్

  • May 28, 2026 13:30 IST

    ఎన్టీఆర్ అంటే వ్యక్తి కాదు.. శక్తి..: కూన రవికుమార్

  • May 28, 2026 13:24 IST

    అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోలేదు: ధూళిపాళ్ల నరేంద్ర

  • May 28, 2026 13:23 IST

    మహానాడులో మంత్రి నిమ్మల రామానాయుడి ప్రసంగం

  • May 28, 2026 13:12 IST

    ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు..

  • May 28, 2026 12:59 IST

    అమరావతి: మహానాడులో ‘అన్నదాతకు అండగా’ తీర్మానం

    • అన్నదాతకు అండగా నిలిచిన ఘటన ఎన్టీఆర్, చంద్రబాబుకే దక్కుతుంది: ఎమ్మెల్యే అశోక్

    • రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు: ఎమ్మెల్యే

    • చంద్రబాబు విజన్‌తో వ్యవసాయరంగ అభివృద్ధి: ఎమ్మెల్యే

  • May 28, 2026 12:51 IST

    నెల్లూరు: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి కామెంట్స్

    • మహానాడు హైబ్రిడ్ పద్ధతిలో వేడుకగా జరుగుతోంది

    • కార్యకర్తలు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు

    • మహిళలకి గౌరవం ఇచ్చి స్త్రీశక్తి పేరు పెట్టడం సంతోషంగా ఉంది

    • మహిళా సాధికారిత కోసం సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారు

    • మహిళల భద్రతకి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది

  • May 28, 2026 12:50 IST

    అమరావతి: ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలని మహానాడులో ఏకగ్రీవంగా తీర్మానం

    • ఎన్టీఆర్‌కు భారతరత్న తెలుగువారి ఆకాంక్ష: సీఎం చంద్రబాబు

    • తెలుగుజాతి గుండెల్లో శాశ్వతంగా ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు

    • లోకేశ్ ప్రతిపాదించిన మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు మనమే ప్రారంభిద్దాం: సీఎం

  • May 28, 2026 12:08 IST

    అమరావతి: మనందరికీ ఆరాధ్య దైవం ఎన్టీఆర్: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

    • తాను రాజకీయాల్లోకి వస్తానని ఎన్టీఆర్ హింట్ ఇచ్చేవారు: గోరంట్ల

    • 1982 మార్చి 28న ఆదర్శ్ నగర్‌లో పార్టీ ప్రకటన చేశారు: గోరంట్ల

    • సామాన్యులు మాత్రమే ఎన్టీఆర్‌కి అండగా నిలిచారు: గోరంట్ల

    • పేదవాడు అంబలి ఇస్తే ఎన్టీఆర్ తాగేవారు: గోరంట్ల

  • May 28, 2026 11:31 IST

    బక్రీద్ సందర్భంగా ముస్లిం నేతలతో సీఎం చంద్రబాబు

    Chandrababu-Naidu.jpg

  • May 28, 2026 10:49 IST

    ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేటలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

    • నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, టీడీపీ శ్రేణులు

  • May 28, 2026 10:48 IST

    ఎన్టీఆర్‌ అంటే పేదలకు భరోసా.. రైతుకు నేస్తం: సీఎం చంద్రబాబు

    • ఎన్టీఆర్ అంటే అన్ని వర్గాలు ప్రేమించే నాయకుడు: చంద్రబాబు

    • సాధారణ ఉద్యోగిగా మొదలై, సినిమా స్టార్‌గా ఎదిగి, ప్రజల కోసం పార్టీ పెట్టి సీఎంగా ఎదడం ఎన్టీఆర్‌కే సాధ్యం: చంద్రబాబు

    • పార్టీ పెట్టి 9నెలల్లో సీఎం కావడం ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు: చంద్రబాబు

    • ప్రాంతీయ పార్టీగా.. జాతీయ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర : చంద్రబాబు

    • ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఎన్టీఆర్ ఎప్పుడూ వీడలేదు: చంద్రబాబు

    • సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనేదే ఎన్టీఆర్‌ సిద్ధాంతం: చంద్రబాబు

  • May 28, 2026 10:46 IST

    విశాఖపట్నం: జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

    • ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు

    • దేశ రాజకీయాలలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుంది: ఎంపీ శ్రీభరత్

    • ఎన్టీఆర్.. మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చిన తరువాత మార్పులు మొదలైంది: శ్రీభరత్

    • టీడీపీలో మహిళలకు33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేశారు: శ్రీభరత్

    • తెలుగుదేశం పార్టీ అంటే ఒక చరిత్ర: చోడే పట్టాభిరామ్

  • May 28, 2026 10:37 IST

    అమరావతి: ఎన్టీఆర్ తెలుగుజాతి సెంటిమెంట్: సీఎం చంద్రబాబు

    • ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం

    • దేశ అత్యున్నత పౌరపురస్కారంతో ఎన్టీఆర్‌ను సత్కరించాలి: సీఎం

  • May 28, 2026 10:31 IST

    ఎన్టీఆర్ ఘాట్ నుంచి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యక్షప్రసారం..

  • May 28, 2026 10:27 IST

    విశాఖ వ్యాప్తంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

    • దేశరాజకీయాలలో టీడీపీ కీలక పాత్ర: ఎంపీ శ్రీభరత్

    • ఎన్టీఆర్.. మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చాకే మార్పు మొదలు: ఎంపీ

    • టీడీపీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం: శ్రీభరత్

  • May 28, 2026 10:14 IST

    విజయవాడ: జగన్ వెన్నుపోటు నిరసనలపై ఎంపీ కేశినేని చిన్ని ఫైర్

    • వెన్నుపోటు పేటెంట్ హక్కు జగన్‌రెడ్డిది: ఎంపీ కేశినేని శివనాథ్

    • వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ గొడ్డలి పార్టీ: ఎంపీ కేశినేని శివనాథ్

    • బాబాయి హత్య, చెల్లికి వెన్నుపోటు, బాబాయి కుమార్తెకు వెన్నుపోటు,..

    • ఆఖరికి తల్లికి కూడా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్: శివనాథ్

    • గొడ్డలి పార్టీ కాబట్టే హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోంది: శివనాథ్

  • May 28, 2026 10:13 IST

    ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నా: లోకేశ్

    • ఎన్టీఆర్ తెలుగు ప్రజల కీర్తి: ఎక్స్‌లో మంత్రి లోకేశ్

    • మహిళా సాధికారతలకు ఎన్టీఆర్ బాటలు వేశారు: లోకేశ్

    • తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారు: లోకేశ్

  • May 28, 2026 10:12 IST

    ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నా: సీఎం చంద్రబాబు

    • తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కారణజన్ముడు: సీఎం

    • ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిన ఆధునిక సంఘ సంస్కర్త: సీఎం

  • May 28, 2026 10:10 IST

    హైదరాబాద్: నేడు ఎన్టీఆర్ 103వ జయంతి

    • ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి, నారా కుటుంబ సభ్యుల నివాళులు

    • నివాళులర్పించిన పురంధేశ్వరి, నారా భువనేశ్వరి

    • నివాళులర్పించిన నందమూరి రామకృష్ణ, జూ.ఎన్టీఆర్‌

  • May 28, 2026 10:08 IST

    అమరావతి: రెండోరోజు టీడీపీ మహానాడు

    • ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన చంద్రబాబు

    • నివాళులర్పించిన లోకేష్, టీడీపీ సీనియర్ నేతలు, మంత్రులు

    • 1,875 క్లస్టర్ల నుంచి మహానాడుకు భారీగా హాజరైన టీడీపీ నేతలు, శ్రేణులు

    • ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడులో ప్రత్యేక తీర్మానం

  • May 27, 2026 18:16 IST

    అమరావతి: తొలిరోజు మహానాడు మహాజోష్‌‌గా సాగింది: చింతకాయల విజయ్

    • ఒక్క రోజులో 7లక్షల మందికి పైగా ప్రతినిధులు 1875 క్లస్టర్లలో హాజరై రికార్డు సృష్టించారు

    • దేశ చరిత్రలో హైబ్రిడ్ విధానంలో ఇంత భారీ స్థాయిలో పాల్గొనడం ఇదే ప్రప్రథమం

    • రేపు మరింత మందికి ఏర్పాట్లు చేస్తున్నాం: టీడీపీ డిజిటల్ మీడియా కన్వీనర్ చింతకాయల విజయ్

  • May 27, 2026 17:30 IST

    కృష్ణా: చంద్రబాబు విజన్ వల్లే హైదరాబాద్ ఐటీ రంగం ప్రపంచ స్థాయికి ఎదిగింది: ఎమ్మెల్యే యార్లగడ్డ

    • దేశ రాజకీయాల్లో టీడీపీకి ప్రత్యేక చరిత్ర ఉంది

    • దేశంలోనే గుర్తింపు పొందిన తొలి ప్రాంతీయ పార్టీ టీడీపీ: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

  • May 27, 2026 16:13 IST

    నెల్లూరు: ఆత్మకూరులోని క్లస్టర్‌లో ఘనంగా మహానాడు

    • మహానాడు వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి ఆనం

    • ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించిన ఎంపీ వేమిరెడ్డి, మంత్రి ఆనం

  • May 27, 2026 15:35 IST

    విశాఖ: భీమిలి నియోజకవర్గంలో ఘనంగా టీడీపీ మహానాడు

    • 12 క్లస్టర్లలో మహానాడు నిర్వహణ బాధ్యతలను ఇంచార్జ్‌లకు అప్పగించిన పార్టీ అధిష్టానం

    • భీమిలి, తగరపువలస, మధురవాడ క్లస్టర్లను సందర్శించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు

    • వర్చువల్ విధానంలో నిర్వహించిన మహానాడులో ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు

  • May 27, 2026 15:33 IST

    అమరావతి: మహానాడులో భావోద్వేగానికి గురైన కార్యకర్త విశ్రాంతమ్మ

    • రూ.5 లక్షల బీమా తనకి రావడంతో కుటుంబం నిలబడిందని విశ్రాంతమ్మ వ్యాఖ్య

    • తన కుటుంబానికి జరిగిన మేలు గురించి చెపుతూ కన్నీరు పెట్టుకున్న విశ్రాంతమ్మ

    • మహానాడు వేదికగా భావోద్వేగానికి గురైన సామాన్య కార్యకర్త విశ్రాంతమ్మ

  • May 27, 2026 14:47 IST

    రాజమండ్రి: రాజమండ్రి సిటీ, రూరల్, అనపర్తి నియోజకవర్గాల్లో మహానాడు

    • క్లస్టర్లలో జరుగుతున్న మహానాడు వర్చువల్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్న కార్యకర్తలు నేతలు

  • May 27, 2026 14:39 IST

    విశాఖపట్నం: విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 82 క్లస్టర్లలో మహానాడు

    • మహానాడు ప్రత్యక్ష ప్రసారం వీక్షించేలా ప్రతి క్లస్టర్‌లో స్ర్కీన్ల ఏర్పాటు

  • May 27, 2026 14:36 IST

    కడప: రాజంపేట నియోజకవర్గంలో ఘనంగా జరుగుతోన్న మహానాడు

    • టీడీపీ రాజంపేట ఇన్‌చార్జి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో వర్చువల్ కార్యక్రమాలు

    • అన్ని క్లస్టర్లలోనూ ఘనంగా జరుగుతున్న మహానాడు కార్యక్రమాలు

  • May 27, 2026 13:55 IST

    అమరావతి: అంచనాలు మించి వర్చువల్ మహానాడకు హాజరైన నాయకులు, కార్యకర్తలు

    • 1,864 క్లస్టర్ల నుంచి 3.84 లక్షల మంది హాజరు

    • సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రసంగం సమాయానికి 3.84 లక్షలకు చేరిన రిజిస్ట్రేషన్లు

  • May 27, 2026 13:48 IST

    క‌ర్నూలు: మహానాడులో మంత్రి టీజీ భరత్ ప్రసంగం

    • రెండేళ్లలో చేసిన అభివృద్ధిని, చేయాల్సిన పనులపై రెండు రోజుల్లో చర్చిస్తాం: టీజీ భరత్

    • ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కేడర్‌పై ఉంది: భరత్

    • విజనరీ లీడర్ సీబీఎన్ వల్లే రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగింది: భరత్

  • May 27, 2026 13:43 IST

    అమరావతి: మహిళలకు 33% రిజర్వేషన్‌పై మంత్రి లోకేశ్ చరిత్రాత్మక నిర్ణయం: అచ్చెన్నాయుడు

    • మహిళల సాధికారతపై లోకేశ్‌కు ఉన్న నిజమైన నిబద్ధతకు ఇది నిదర్శనం: అచ్చెన్న

    • మహిళల గురించి మాట్లాడేవారు చాలా మంది ఉన్నా ఇలాంటి నిర్ణయం తీసుకునే నాయకుడు లోకేశ్: అచ్చెన్న

    • మహిళలకు రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించాలనే ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది: అచ్చెన్న

  • May 27, 2026 13:40 IST

    నంద్యాలలో ఘనంగా తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు

    • మంత్రి ఫరూక్ నేతృత్వంలో 10 క్లస్టర్లలో ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు

    • 44 ఏళ్లుగా మహానాడుకు హాజరవుతున్నానని తెలిపిన సీనియర్ నేత, మంత్రి ఫరూక్

    • ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ.. బడుగు బలహీన వర్గాల పార్టీ: జిల్లా ఆబ్జర్వర్ నారాయణ స్వామి

  • May 27, 2026 12:30 IST

    మహానాడులో కీలక ప్రకటన చేసిన మంత్రి లోకేశ్

    • మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన యువనేత నారా లోకేశ్

    • పార్లమెంటు బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు రిజర్వేషన్: లోకేశ్

    • 2029 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మహిళలకు 33% సీట్లు: లోకేశ్

    • ఇది మా సంకల్పం.. మా బాధ్యత.. మా కమిట్‌మెంట్: లోకేశ్

  • May 27, 2026 12:28 IST

    అమరావతి: మహానాడులో మంత్రి నారా లోకేశ్ ప్రసంగం

    • నిజం గడపదాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తోంది: లోకేశ్

    • గొడ్డలి పార్టీ చేసే కుట్రలను ఎప్పుడూ మనం గమనిస్తూ ఉండాలి: లోకేశ్

    • డీఎస్సీని అడ్డుకోవాలని చూశారు: లోకేశ్

    • నీది టెన్త్ పేపర్ లీక్ చేసిన చరిత్ర.. నాది స్టాన్‌ఫోర్డ్‌లో చదివిన చరిత్ర: లోకేశ్

    • టీచర్లను మేము సింగపూర్ పంపితే.. నువ్వు మద్యం షాపుల ముందు కాపలా పెట్టావు: లోకేశ్

  • May 27, 2026 12:28 IST

    అమరావతి: మహానాడులో మంత్రి నారా లోకేశ్ ప్రసంగం

    • సొంత తల్లిని, చెల్లిని మెడపెట్టి గెంటేసారు: లోకేశ్

    • బాబాయిని గొడ్డలితోనే కదా చంపారు.. అందుకే మిమ్మల్ని గొడ్డలి పార్టీ అని పిలుస్తున్నాం: లోకేశ్

    • గత మహనాడులో 6 శాసనాలు తీసుకున్నాం.. వీటిని మనం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి: లోకేశ్

    • పార్టీలో సంస్కరణలు తీసుకురావడానికి ఎంతో పోరాడాం: లోకేశ్

    • జిల్లా పార్టీ నుంచి పార్లమెంటరీ పార్టీ తీసుకురావడానికి ఎంతో పోరాటం చేశాం: లోకేశ్

  • May 27, 2026 12:18 IST

    మహానాడులో మంత్రి లోకేశ్ ప్రసంగం

    • 2024లో అఖండ మెజార్టీతో కూటమిని గెలిపించారు: లోకేశ్

    • ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం: లోకేశ్

    • జగన్‌కు ఇదే నా సవాల్.. అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు మీరు సిద్ధమా?: లోకేశ్

  • May 27, 2026 12:15 IST

    మహానాడులో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ ప్రసంగం

    • తెలుగు ప్రజలు ఎక్కడున్నా సీబీఎన్ అనే మాట వినిపిస్తుంది: లోకేశ్

    • చంద్రబాబులో 25 ఏళ్ల యువకులు ముగ్గురు ఉన్నారు: లోకేశ్

    • ఇప్పటికీ చంద్రబాబు జెట్ స్పీడ్‌తో పని చేస్తున్నారు: లోకేశ్

    • 2019-24 వరకు ఎన్నో కష్టాలు చూశాం : లోకేశ్

    • మనపై ఎన్నో కేసులు పెట్టి వేధించారు: లోకేశ్

    • ఇబ్బందులు పెట్టినా.. తగ్గేదేలేదన్నాం: లోకేశ్

  • May 27, 2026 12:14 IST

    మహానాడులో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ ప్రసంగం

    • మహానాడు అంటే మాస్ జాతర: లోకేశ్

    • నేషన్ ఫస్ట్ అనేది టీడీపీ నినాదం: లోకేశ్

    • ప్రధాని మోదీ పిలుపుతో హైబ్రిడ్ మోడ్‌లో మహానాడు నిర్వహిస్తున్నా: లోకేశ్

    • హైబ్రిడ్ అనగానే టీమ్11 ఎగతాళి చేసింది: లోకేశ్

    • టీమ్ 11కు ఒకటే చెబుతున్నాం.. ముందు ముందు బ్యాటింగ్ చేసే బాధ్యత మాదే: లోకేశ్

  • May 27, 2026 12:09 IST

    అమరావతి: వర్చువల్ మహానాడుకు భారీ స్పందన

    • మహానాడు ప్రారంభ సమయంలోనే భారీగా రిజిస్ట్రేషన్లు

    • 1,864 క్లస్టర్ల నుంచి 2.23 లక్షల మంది హాజరు

    • ఉదయం 10.30 తరువాత మరింత పెరిగిన రిజిస్ట్రేషన్లు

    • రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం

    • వర్చువల్ మీటింగ్‌పై కార్యకర్తల ఆసక్తి

  • May 27, 2026 12:00 IST

    అమరావతి: చనిపోయిన టీడీపీ నేతలకు సంతాపం

    • మరణించిన టీడీపీ కార్యకర్తలు, నేతలకు సంతాపం తెలుపుతూ, టీడీపీ మహానాడులో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన VMRDA ఛైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్

  • May 27, 2026 11:56 IST

    అమరావతి: మహానాడులో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • ప్రతి ఒక్కరూ ఈవీకి మార్సాలిన అవసరం ఉంది: చంద్రబాబు

    • చెత్త పన్ను తొలగించి.. స్వచ్ఛ ఆంధ్రాకు శ్రీకారం చుట్టాం: చంద్రబాబు

    • అన్నీ చేస్తున్నాం.. కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి: చంద్రబాబు

  • May 27, 2026 11:44 IST

    మహానాడులో సీఎం చంద్రబాబు ప్రసంగం..

    • జాతీయ రహదారుల నుంచి అన్ని రోడ్లపై దృష్టిపెట్టాం: చంద్రబాబు

    • అన్నిరంగాల్లో సమర్థత పెంచుతున్నాం: చంద్రబాబు

    • కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పాం.. పెంచలేదు: చంద్రబాబు

    • రెండేళ్లలో ఛార్జీలు పెంచలేదు.. భవిష్యత్‌లోనూ పెంచం: చంద్రబాబు

  • May 27, 2026 11:44 IST

    మహానాడులో సీఎం చంద్రబాబు ప్రసంగం..

    • రాజధానిపై వైసీపీకి విధానం లేదు: చంద్రబాబు

    • వైసీపీకి ఒక గోల్ లేదు.. అది అడ్డగోలు బ్యాచ్‌: చంద్రబాబు

    • అధికారంలో ఉండగా మూడు రాజధానులు అన్నారు: చంద్రబాబు

    • అధికారం పోయాక.. ఇప్పుడు మావిగన్ అంటున్నారు: చంద్రబాబు

    • అమరావతిపై వైసీపీ విష ప్రచారం: చంద్రబాబు

  • May 27, 2026 11:36 IST

    మహానాడులో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • పేదలకు కావలసింది పథకాలు.. గొడ్డలి వేట్లు కాదు: చంద్రబాబు

    • యువతకి కావలసింది ఉద్యోగాలు.. గొడ్డలి పోట్లు కాదు: చంద్రబాబు

    • రాష్ట్రానికి కావలసింది శాంతి భద్రతలు.. రక్తాభిషేకాలు కాదు: చంద్రబాబు

    • రక్త చరిత్ర రాసే వాళ్ళు.. స్వర్ణాంధ్ర చరిత్ర లిఖించలేరు: చంద్రబాబు

  • May 27, 2026 11:33 IST

    అమరావతి: మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగులు

    • వేట కొడవళ్ళ నుంచి గొడ్డళ్లకు మారడం వైసీపీ విధానం

    • ఐటీ నుంచి క్వాంటం వరకు మారడం మన విధానం

    • బోత్ ఆర్ నాట్ సేమ్ (Both are not same)

  • May 27, 2026 11:30 IST

    అమరావతి: మహానాడులో సీఎం చంద్రబాబు ప్రసంగం..

    • ఆగస్ట్ 15 నాటికి ఏపీ అంతటా డిజిటల్ హెల్త్ ప్రాజెక్టు అమలు: చంద్రబాబు

    • గత ప్రభుత్వం అన్నివర్గాలను మోసం చేసింది: చంద్రబాబు

    • విద్యారంగంలో ఏపీని రోల్‌ మోడల్‌గా నిలబెడుతున్నాం: చంద్రబాబు

  • May 27, 2026 11:27 IST

    మహానాడులో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్‌ వచ్చింది: చంద్రబాబు

    • 280 ప్రాజెక్టులు ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నాం: చంద్రబాబు

    • పనిచేసేవాళ్లు రాణిస్తారు.. పనిచేయకపోతే వెనకబడిపోతారు: చంద్రబాబు

    • ప్రపంచంలో ఉన్న టెక్నాలజీల కంటే బెస్ట్‌ని ఏపీకి తీసుకొస్తాం: చంద్రబాబు

    • గత ప్రభుత్వం అన్నివర్గాలను మోసం చేసింది: చంద్రబాబు

    • రూ.240 కోట్లతో మత్స్యకారులకు ఆధునిక బోట్లు అందించనున్నాం: చంద్రబాబు

    • చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ సరఫరా: చంద్రబాబు

    • అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లకు గౌరవ వేతనం: చంద్రబాబు

  • May 27, 2026 11:25 IST

    మహానాడులో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మహిళల కోసం పథకాలు అమలు: చంద్రబాబు

    • బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తుంటే ఆనందంగా ఉంది: చంద్రబాబు

    • మహిళల భద్రతకు ప్రాధాన్యత: చంద్రబాబు

    • విశాఖకు గూగుల్‌.. పుట్టపర్తికి ఫైటర్‌జెట్ వచ్చింది: చంద్రబాబు

    • ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో వేగం పెంచాం: చంద్రబాబు

  • May 27, 2026 11:14 IST

    మహానాడులో సీఎం చంద్రబాబు ప్రసంగం..

    • పశ్చిమాసియా యుద్ధ వాతావరణం మూలంగా మహనాడును వర్చువల్‌గా నిర్వహిస్తున్నాం: చంద్రబాబు

    • సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అని 44 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ టీడీపీ: చంద్రబాబు

    • సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది టీడీపీ: చంద్రబాబు

    • జండర్ ఈక్వాలిటీ, సామాజిక సమస్యలపై టీడీపీ పోరాడింది: చంద్రబాబు

    • విజన్ పాలిటిక్స్‌కు నాంది పలికింది టీడీపీ: చంద్రబాబు

    • టీడీపీ పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్నీ అద్భుతాలే.. ప్రతి అడుగు సంచలనమే: చంద్రబాబు

  • May 27, 2026 11:13 IST

    అమరావతి: టీడీపీ ప్రతి అడుగు సంచలనమే: సీఎం చంద్రబాబు

    • మహానాడులో ప్రారంభోపన్యాసం ఇచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు

    • 1,875 క్లస్టర్ల వేదికగా మాహానాడు జరగుతోంది: చంద్రబాబు

    • లక్షలాదిమంది కార్యకర్తలు తొలిరోజే అదరగొట్టారు: చంద్రబాబు

  • May 27, 2026 11:11 IST

    అమరావతి: వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గిందేమో కానీ.. కార్యకర్తల్లో జోరు తగ్గలేదు: సీఎం చంద్రబాబు

  • May 27, 2026 11:04 IST

    అమరావతి: పయ్యావుల కేశవ్ స్పీచ్..

  • May 27, 2026 11:00 IST

    విజయవాడ: పశ్చిమ నియోజకవర్గంలో మహానాడుకు హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్

    • మహానాడు తెలుగువారందరి పండుగ: కేశినేని శివనాథ్

    • కోటి మంది సభ్యులు ఉన్న పార్టీ టీడీపీ: శివనాథ్

    • కార్యకర్తల వల్లే ఈరోజు టీడీపీ ఈ స్థాయిలో వుంది: శివనాథ్

  • May 27, 2026 10:56 IST

    మహానాడు వేడుక దృశ్యాలు ఇక్కడ ఇచ్చిన ఎక్స్ పోస్టు‌లో చూడొచ్చు..

  • May 27, 2026 10:44 IST

    కడప: ఉమ్మడి కడప జిల్లాలో ప్రారంభమైన మహానాడు

    • మహానాడులో పాల్గొన్న ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్ ఎమ్మెల్యేలు

  • May 27, 2026 10:41 IST

    మహానాడులో మంత్రి లోకేశ్ భారీ ప్రకటన!

    • మహానాడులో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తొలి ప్రసంగం చేయనున్న లోకేశ్

    • ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మాట్లాడనున్న లోకేశ్

    • కీలక ప్రకటన చేయనున్నట్లు తెలిపిన లోకేశ్

  • May 27, 2026 10:38 IST

    టీడీపీ మహానాడులో తెలంగాణ నుంచి నాలుగు తీర్మానాలు

    • వ్యవసాయం - నీటిపారుదల రంగం

    • కాంగ్రెస్‌ హామీలు - అమలులో వైఫల్యం

    • భూభారతిలో లోపాలు

    • విద్య - వైద్యంపై తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు

  • May 27, 2026 10:35 IST

    అనంతపురం: అర్బన్ నియోజకవర్గంలో ప్రారంభమైన మహానాడు

    • పాల్గొన్న జోనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్

    • ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన శ్రీనివాసరెడ్డి, దగ్గుపాటి ప్రసాద్

  • May 27, 2026 10:31 IST

    అమరావతి: పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించిన సీఎం చంద్రబాబు

    • ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు

  • May 27, 2026 10:29 IST

    టీడీపీ మహానాడు ప్రారంభం

    • పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు

    • నేటి నుంచి రెండు రోజులు మహానాడు

    • వర్చువల్‌గా భారీ స్థాయిలో మహానాడు

    • ప్రతీ క్లస్టర్‌లోనూ మహానాడు నిర్వహిస్తోన్న శ్రేణులు

    • ఈసారి 'స్త్రీ శక్తి' థీమ్‌తో మహానాడు