తల్లికి, చెల్లికి లేని రక్షణ.. రాష్ట్ర మహిళలకు ఇస్తారా? జగన్‌పై టీడీపీ ఎంపీ ధ్వజం
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:41 PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యత పక్కన బెట్టి, కేవలం తాడేపల్లి ప్యాలెస్‌లో నాలుగు గోడల మధ్య ప్రెస్ మీట్‌లకే పరిమితం కావడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
అమరావతి, మార్చి 11: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యత పక్కన బెట్టి, కేవలం తాడేపల్లి ప్యాలెస్‌లో నాలుగు గోడల మధ్య ప్రెస్ మీట్‌లకే పరిమితం కావడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీకి రాకుండా ఆర్థిక వనరులు, ఆర్థిక వ్యవస్థ గురించి జగన్ మాట్లాడుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయంటూ టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర విమర్శలు చేశారు.
జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లి ప్యాలెస్‌లో మీడియా సమావేశం నిర్వహించడంపై టీడీపీ ఎంపీ అప్పలనాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ..‘ ప్రజాస్వామ్యంలో శాసనసభ అనేది ప్రజల గొంతుక వినిపించే అత్యున్నత వేదిక. కానీ, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా నాలుగు గోడల మధ్యలో పిల్లిలాగ కూర్చొని ప్రెస్ మీట్‌లు పెడుతున్నారు. ఆర్థిక వనరులు, ఆర్థిక వ్యవస్థ గురించి జగన్ మాట్లాడుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయి. ఐదేళ్లలో ప్రజలకు ఏమి లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. జగన్ హయాంలో మున్సిపల్ ఆఫీస్‌ని సైతం తాకట్టు పెట్టారు. దేశంలో ఎక్కడా లేని పాలసీని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెట్టి దివాలా తీశారు. కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి లేఖ రాస్తానని అంటున్నారు, జగన్ చిట్టా మొత్తం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మహిళలకు రక్షణ లేదని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, కన్నతల్లికి చెల్లికి ఎంత రక్షణ కలిపించారో చెప్పాలి. సొంత చెల్లెలుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి ఇబ్బందిపెట్టారు. జగన్ సొంత మద్యం బ్రాండ్ పెట్టి 30 వేల మంది మహిళల తాళిబొట్లు తెంపారు’అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిలిండర్ బుకింగ్‌లో అపరిచితులకు ఓటీపీ చెప్పొద్దు: ఏసీపీ
For More TG News And Telugu News