టీడీపీ మహానాడు రికార్డు.. వర్చువల్‌గా పాల్గొన్న 6 లక్షల కార్యకర్తలు
ABN , Publish Date - May 27 , 2026 | 05:03 PM
టీడీపీ మహానాడుకు రికార్డు స్థాయిలో స్పందన లభించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని 1875 క్లస్టర్ల ద్వారా వర్చువల్‌గా ఆరు లక్షల మంది కార్యకర్తలు మహానాడులో పాల్గొన్నట్లు వెల్లడించారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుకు రికార్డు స్థాయిలో స్పందన లభించింది. హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించిన ఈ మహానాడులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్లస్టర్లతో పాటు తెలంగాణ, అండమాన్, ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. మొత్తం ఆరు లక్షల మంది కార్యకర్తలు మహానాడులో పాల్గొన్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 1875 క్లస్టర్ల ద్వారా కార్యకర్తలు తమ ఐడీ కార్డులతో హాజరు నమోదు చేసుకున్నారని తెలిపారు.
రామ్మోహన్ నాయుడు ఈ ప్రకటన చేయగానే మహానాడులో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు హర్షధ్వానాలు చేశారు. ఒక ప్రాంతీయ పార్టీ హైబ్రిడ్ మోడ్‌లో మహానాడు నిర్వహించడం, లక్షలాది మంది వర్చువల్‌గా పాల్గొనడం రికార్డు అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో భారీగా ఎమ్మార్వోలు బదిలీ
నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్
For More AP News