Share News

టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నివాళి..

ABN , Publish Date - Aug 23 , 2026 | 10:16 AM

ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, దివంగత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారతదేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నివాళి..

అమరావతి: ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, దివంగత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారతదేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో బ్రిటిష్ వారిని ఎదురించి నిలబడ్డారని కొనియాడారు. ఆంధ్రకేసరిగా పేరు సంపాదించి తెలుగువారి సాహసం, పౌరుషానికి ప్రతీకగా నిలిచారని ప్రశంసించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా చంద్రబాబు, లోకేశ్ ఆయనను స్మరించుకున్నారు.


సీఎం చంద్రబాబు ఎక్స్ పోస్టు..

'నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే గుణం కీ.శే.టంగుటూరి ప్రకాశం పంతులు గారి నైజం. ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ఆంధ్రకేసరి తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీక. ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుని విశిష్ట వ్యక్తిత్వాన్ని, సాహస పోరాటాన్ని స్మరించుకుంటూ ఆయన స్మృతికి నివాళులు అర్పిద్దాం' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


మంత్రి నారా లోకేశ్ నివాళి..

'స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. బ్రిటిష్ తుపాకులకు ఎదురు నిలిచి ఆంధ్రకేసరిగా ఆయన పేరు గడించారు. రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శం. టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా రాష్ట్రానికి వారు అందించిన సేవలను స్మరించుకుందాం' అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఏఈ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చూస్తే కఠిన చర్యలు: మంత్రి గొట్టిపాటి

విశాఖలో సందడిగా సండేస్ ఆన్ సైకిల్.. ఆర్కే బీచ్‌లో బ్రిక్స్ దేశాల మంత్రుల సైక్లింగ్..

Updated Date - Aug 23 , 2026 | 10:24 AM