Share News

ఏపీ ట్రాఫిక్ చలాన్ల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Apr 24 , 2026 | 07:37 PM

ఏపీ ట్రాఫిక్ చలాన్ల నిధుల వినియోగంపై కొనసాగుతున్న వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆర్బిట్రేషన్ ఉత్తర్వులపై స్టే విధించిన అత్యున్నత న్యాయస్థానం, డేటా ఎవాల్వ్ సంస్థకు నోటీసులు జారీ చేసింది.

ఏపీ ట్రాఫిక్ చలాన్ల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
AP Traffic Challan Case

అమరావతి: ఏపీ ట్రాఫిక్ చలాన్ల నిధుల వినియోగంపై కొనసాగుతున్న వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆర్బిట్రేషన్ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అలాగే, ఈ వ్యవహారానికి సంబంధించి డేటా ఎవాల్వ్ సంస్థకు నోటీసులు జారీ చేసింది.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకారం, ట్రాఫిక్ చలాన్ల ద్వారా సేకరించిన నిధులు ఒప్పందం ముగిసిన తర్వాత కూడా అక్రమంగా మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు రూ.37 కోట్ల ప్రజా ధనాన్ని వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది.


ఈ కేసులో క్రిమినల్ ఆరోపణలు ఉన్నప్పుడు ఆర్బిట్రేషన్ కుదరదని ఏపీ ప్రభుత్వం వాదించింది. ప్రజా నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నందున, దీనిపై పూర్తిస్థాయి విచారణ అవసరమని పేర్కొంది. వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను మే 25కి వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Read Latest AP News

Updated Date - Apr 24 , 2026 | 07:37 PM