Share News

సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

ABN , Publish Date - Apr 20 , 2026 | 10:16 AM

సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రధాని మోదీ స్పందించారు.

సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘నా ఆప్తమిత్రుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పురోగతిలో ముందంజలో ఉంది. చంద్రబాబుకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.


ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

ప్రధాని మోదీ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. మీ నాయకత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. వికసిత భారత్ లక్ష్యంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తమిళనాడులో ఎన్నికల ప్రచారం.. కోయింబత్తూర్‌కు సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన జగన్, షర్మిల

For More AP News And Telugu News

Updated Date - Apr 20 , 2026 | 12:30 PM