Share News

తమిళనాడులో ఎన్నికల ప్రచారం.. కోయింబత్తూర్‌కు సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Apr 20 , 2026 | 09:54 AM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు.

తమిళనాడులో ఎన్నికల ప్రచారం.. కోయింబత్తూర్‌కు సీఎం చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్ 20: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. నేడు, రేపు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల తరపున ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అందుకోసం సోమవారం ఉదయం 10.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా కోయింబత్తూర్ చేరుకుంటారు.


ఈ రోజు మధ్యాహ్నం 1.00 గంటకు కోయింబత్తూరులో ఎన్డీయే పార్టీలు నిర్వహించే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం తాలి, అవడి, అన్నానగర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. 2.50 గంటలకు హోసూర్ సమీపంలోని తాలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 05.45 గంటలకు అవడిలో ఎన్నికల సభలో పాల్గొంటారు. రాత్రి 07.30 గంటలకు అన్నా నగర్‌లో సీఎం చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోజు రాత్రి చెన్నైలో సీఎం చంద్రబాబు బస చేయనున్నారు.


ఒక దశ పోలింగ్..

ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఒకే విడతలో జరుగుతున్న ఈ ఎన్నికల పోలింగ్‌కు మంగళవారంతో ప్రచారం తెరపడనుంది. దీంతో ఈ ఎన్నికల బరిలో నిలిచిన అన్ని పార్టీల నేతలు.. తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన జగన్, షర్మిల

సీఎం చంద్రబాబు జన్మదినం.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు

For More AP News And Telugu News

Updated Date - Apr 20 , 2026 | 10:11 AM