దేశంలో క్రీడలకు కొత్త దిశ చూపిన ఘనత ప్రధాని మోదీది: కేంద్ర మంత్రి పెమ్మసాని
ABN , Publish Date - Aug 27 , 2026 | 02:58 PM
దేశంలో క్రీడలకు కొత్త దిశ చూపిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. 2014 తర్వాత క్రీడారంగంలో వ్యవస్థీకృత సంస్కరణలు జరిగాయని వివరించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు27: దేశంలో క్రీడలకు కొత్త దిశ చూపిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. 2014 తర్వాత క్రీడారంగంలో వ్యవస్థీకృత సంస్కరణలు జరిగాయని వివరించారు. ప్రతిభ గుర్తింపు, యాంటీ డోపింగ్ చట్టాలతో క్రీడలకు ఊతం లభించినట్లు అయిందన్నారు. గుంటూరులో రూ.14 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టామని చెప్పారు. క్రీడా బడ్జెట్‌లో కేటాయింపులు రూ.2 వేల నుంచి రూ.4 వేల కోట్లకుపైగా పెంచినట్లు తెలిపారు.
వచ్చే ఐదేళ్లలో రూ.25 వేల కోట్లతో క్రీడా మౌలిక సదుపాయాల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి పెమ్మసాని పేర్కొన్నారు. ఒలింపిక్ స్థాయి శిక్షణా కేంద్రాల ఏర్పాటే కేంద్ర ప్రభుత్వ విజన్‌కు నిదర్శనమని అన్నారు. 2030 కామన్వెల్త్, 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. యువతతో సంభాషణ ద్వారా వారి అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గత పదేళ్లలో భారత్ పతకాల పెరుగుదలకు యువతలో పెరిగిన ఆత్మవిశ్వాసమే కారణమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రామ్‌దేవ్ బాబా నా బెడ్‌రూమ్‌లో గబ్బిలంలా వేలాడుతున్నారా?.. కంగన ఘాటు వ్యాఖ్యలు
క్యాడర్ చేజారిపోకుండా ఉండేందుకే ఊహాజనిత వ్యాఖ్యలు.. జగన్‌పై మంత్రి ఫైర్
Read Latest AP News And Telugu News