పల్నాడు జిల్లా యడ్లపాడులో భారీ చోరీ.. ఏకంగా రూ.75 లక్షల సొత్తు స్వాహా..
ABN , Publish Date - Sep 10 , 2026 | 04:58 PM
పల్నాడు జిల్లా యడ్లపాడులో భారీ చోరీ జరిగింది. ఓ ఇంటిని టార్గెట్ చేసిన దుండగులు ఎవరూ లేని సమయం చూసి ఏకంగా రూ.75 లక్షల సొత్తును దొంగిలించారు.
పల్నాడు జిల్లా: యడ్లపాడులో భారీ చోరీ జరిగింది. ఓ ఇంటిని టార్గెట్ చేసిన దుండగులు ఎవరూ లేని సమయం చూసి ఏకంగా రూ.75 లక్షల సొత్తును దొంగిలించారు. ఊరు నుంచి తిరిగొచ్చిన మహిళ.. ఇంట్లోని బంగారం, వెండి నగలు, నగదు కనిపించకపోవడంతో షాక్ అయ్యింది. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..?
యడ్లపాడుకు చెందిన పార్వతి అనే మహిళ వ్యక్తిగత పనుల నిమిత్తం ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లింది. ఇంటికి తాళాలు వేసి ఉండటాన్ని గమనించిన దుండగులు అక్రమంగా లోపలికి ప్రవేశించారు. ఇంట్లో భద్రపరిచిన 46 సవర్ల బంగారం, సుమారు 5 కిలోల వెండి ఆభరణాలను చోరీ చేశారు. వాటితో పాటు రూ.50 వేలను అపహరించారు. ఇంటికి తిరిగి వచ్చిన పార్వతి.. తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో యడ్లపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లోని వస్తువులను పరిశీలించి ఆధారాలు సేకరించారు. చోరీ జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుల కదలికలు కెమెరాల్లో రికార్డయినట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఘటనపై కేసు నమోదు కాగా.. దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
కాకినాడ జిల్లాలో పులి సంచారంపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష..
వృద్ధిరేటులో ప్రకాశం జిల్లా దూకుడు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు..