Share News

ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన..!

ABN , Publish Date - Aug 18 , 2026 | 06:23 PM

రాగల మూడు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని రాజధాని అమరావతిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన..!

అమరావతి, ఆగస్టు18: రాగల మూడు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని రాజధాని అమరావతిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది.


ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

డీఎస్సీపై చర్చకు ఆహ్వానిస్తే.. తప్పించుకు తిరుగుతున్న జగన్: కేంద్ర మంత్రి

మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 06:26 PM