కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు..
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:50 PM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని దేవుడిని ప్రార్థించారు.
అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని దేవుడిని ప్రార్థించారు. ఆపారమైన శక్తితో దేశ ప్రగతిని ఆమె ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చంద్రబాబు, లోకేశ్ పోస్టు పెట్టారు.
సీఎం చంద్రబాబు ఎక్స్ పోస్టు..
'గౌరవనీయ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నాను. దేశ ప్రగతికి మీరు అదే అంకితభావం, అవిశ్రాంత శక్తితో మార్గనిర్దేశం చేస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు..
నిర్మలా సీతారామన్‌కు మంత్రి నారా లోకేశ్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి ఆమె అందిస్తున్న విశిష్ట సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రికి మంచి ఆరోగ్యం, సంతోషం, మరింత శక్తి లభించాలని దేవుడిని కోరారు. రాబోయే ఏడాది మరిన్ని విజయాలు సాధించాలని లోకేశ్ ప్రార్థించారు.
ఈ వార్తలు కూడా చదవండి
స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్
చెడిపోయిన ప్రతి మొక్కకు వెయ్యి సాయం.. కొత్త మొక్కలు పెట్టిస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు