డీజే వాహనాలకు అనుమతులు ఇవ్వండి.. నారా లోకేశ్ విజ్ఞప్తి
ABN , Publish Date - Sep 17 , 2026 | 08:59 PM
గణేశ్ నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా డీజే వాహనాలకు అనుమతుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. హోంమంత్రి అనిత, డీజీపీ జోక్యం చేసుకుని అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అమరావతి: గణేష్ నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా డీజే వాహనాలకు అనుమతుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. ఈ మేరకు హోంమంత్రి అనిత, డీజీపీ జోక్యం చేసుకుని అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని విజ్ఞప్తి చేశారు.
గణేష్ నిమజ్జనానికి సంబంధించి డీజే వాహనాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదంటూ తనకు పలువురు సందేశాలు పంపుతున్నారని లోకేశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమాలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని హోంమంత్రి, డీజీపీని కోరారు. అలాగే నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో డీజే వాహనాలను సీజ్ చేయకుండా చూడాలని పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు.
Also Read:
మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ కుటుంబానికి సీఎం రేవంత్ అండ
అవన్నీ వదంతులే.. యూపీఐపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు