Share News

ముంబై ఆస్పత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం దేవేంద్ర ఫడణవీస్

ABN , Publish Date - Jul 13 , 2026 | 05:49 PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. అనంతరం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ముంబై ఆస్పత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం దేవేంద్ర ఫడణవీస్
CM Devendra Fadnavis Meets Pawan Kalyan

ఇంటర్నెట్ డెస్క్, జులై 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. అనంతరం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఆస్పత్రికి వెళ్లి పవన్ కల్యాణ్‌ను పరామర్శించారు.


ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని ఫడణవీస్‌ అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై కూడా వివరాలు ఆరా తీశారు. తన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఆస్పత్రికి వచ్చి పరామర్శించినందుకు దేవేంద్ర ఫడణవీస్‌కు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీ సందర్భంగా ఇద్దరు నాయకులు కాసేపు ఆత్మీయంగా పలుకరించుకున్నట్లు తెలుస్తోంది.

PAWAN-1.jpg


పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

PAWAN.jpg


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది: సీఎం చంద్రబాబు

సీఆర్డీఏ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఊరట

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 13 , 2026 | 06:35 PM