మౌనాన్ని బలహీనతగా.. సహనాన్ని భయంగా భావించవద్దు: కోట రుక్మిణి
ABN , Publish Date - Nov 18 , 2026 | 08:47 PM
నకిలీ ఉద్యోగ నియామకాల స్కాంలో అసలు నిందితులను వదిలి తనను టార్గెట్ చేస్తున్నారని జనసేన పార్టీ నాయకురాలు కోట రుక్మిణి అన్నారు. ఈ స్కాం విషయం తెలియగానే ధరణి కృష్ణను తాను ఉద్యోగం నుంచి తొలగించానని చెప్పారు.
అమరావతి, నవంబర్18: నకిలీ ఉద్యోగ నియామకాల స్కాంలో అసలు నిందితులను వదిలి తనను టార్గెట్ చేస్తున్నారని జనసేన పార్టీ నాయకురాలు కోట రుక్మిణి అన్నారు. ఈ స్కాం విషయం తెలియగానే ధరణి కృష్ణను తాను ఉద్యోగం నుంచి తొలగించానని చెప్పారు. ఈ స్కాంపై విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ వివాదంలోకి అనవసరంగా జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లాగవద్దని సూచించారు. తన మౌనాన్ని బలహీనతగా.. తన సహనాన్ని భయంగా భావించవద్దని తెలిపారు.
తాను ఏదైనా చట్టపరంగా పోరాడతానని కోట రుక్మిణి స్పష్టం చేశారు. తాను అంకితభావం కలిగిన జనసైనికురాలిని అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని జనసేన పార్టీ కార్యాలయం పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 7 కోట్లు మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ స్కాంతో జనసేన పార్టీ నాయకురాలు కోట రుక్మిణికి సంబంధం ఉందంటూ ఓ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆమె స్పందించారు. తప్పు చేసిన వారిని వదిలి తనని టార్గెట్ చేయడం ఏమిటంటూ కోట రుక్మిణి ఓ ప్రకటన చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు: స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ రవిచంద్ర
మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి