తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు: స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ రవిచంద్ర
ABN , Publish Date - Nov 18 , 2026 | 06:59 PM
తిరుమలలో కొలువైన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు కల్పించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ ఎం. రవిచంద్ర తెలిపారు. డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు భక్తులకు ఈ ద్వార దర్శనాలు కల్పిస్తామని చెప్పారు.
తిరుపతి, నవంబర్18: తిరుమలలో కొలువైన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు కల్పించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ ఎం. రవిచంద్ర తెలిపారు. డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు భక్తులకు ఈ ద్వార దర్శనాలు కల్పిస్తామని చెప్పారు. బుధవారం తిరుమలలో టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ ఎం. రవిచంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఆయన వెల్లడించారు. గతేడాది వైకుంఠ ద్వార దర్శనాలను 7.45 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని పేర్కొన్నారు.
గతేడాది కంటే అదనంగా ఈ ఏడాది మరో 51 వేల మందికి దర్శనం చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అయితే మొదటి మూడు రోజులు మాత్రమే డిప్ విధానం ద్వారా భక్తులకు దర్శనం కల్పిస్తామని అన్నారు. ఏడు రోజులు సర్వదర్శనం గుండా భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. ఇక తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్ షిప్‌ను రూ.2,750 కోట్లతో నిర్మిస్తామని తెలిపారు. అలాగే తిరుమల, తిరుపతిలో పారిశుద్ధ్యం కార్మికుల సంఖ్య పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు.
శ్రీవారి ఆలయంలో నెయ్యి ఉత్పత్తికి రూ.7.7 కోట్లతో 500 ఆవులు కొనుగోలు చేస్తామని అన్నారు. రెండేళ్ల పాటు తిరుమల, తిరుపతిలో వన్యప్రాణుల సంరక్షణకు 16.4 కోట్లు నిధులు కేటాయించినట్లు వివరించారు. భక్తుల సౌకర్యార్థం శ్రీవారి మెట్లకు వెళ్ళే రోడ్డు మార్గాన్ని అభివృద్ది చేస్తామని పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవాల బహుమానంగా రూ.16,940 అందిస్తామని చెప్పారు. అందులో సగం నిధులు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇస్తామని వివరించారు.
వేద పారాయణదారులతోపాటు ప్రబంధం చేసే వారి వేతన పెంచుతామని చెప్పారు. స్విమ్స్ ఆస్పత్రిలో పరికరాల బకాయిలకు రూ.41.2 కోట్లు నిధులు విడుదల చేస్తామని తెలిపారు. అలాగే స్విమ్స్‌లో మరింత వైద్య సేవలను పెంపొందించేందుకే నిర్ణయించినట్లు వివరించారు. శిల్ప కళాశాలలో హాస్టళ్లలో సౌకర్యాలకు రూ.23 కోట్లు, టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల అభివృద్ధికి రూ.230 కోట్లు నిధులు కేటాయించినట్లు చెప్పారు. రూ. 80 కోట్లు టీటీడీ ఉద్యోగులు ఖర్చుగా నిర్ణయించామని స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ రవిచంద్ర పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం
మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి