పార్టీ కార్యకర్తలకు జనసేన అండగా ఉంటుంది: ప్రభుత్వ విప్
ABN , Publish Date - Mar 30 , 2026 | 09:24 PM
కార్యకర్తల కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ పి. హరి ప్రసాద్ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇవ్వాలనేది జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉద్దేశమని ఆయన తెలిపారు.
అమరావతి, మార్చి30: కార్యకర్తల కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ పి. హరి ప్రసాద్ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇవ్వాలనేది జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉద్దేశమని ఆయన తెలిపారు. సోమవారం రాజధాని అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీకి చెందిన పలువురు కార్యకర్తల కుటుంబాలకు రూ.70 లక్షల చెక్కులు అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృతి చెందారు. వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులను ప్రభుత్వ విప్ హరిప్రసాద్ పంపిణీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు శాఖల ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
పీ4 కార్యక్రమం ఇచ్చిన తృప్తి మరేదీ ఇవ్వలేదు: సీఎం చంద్రబాబు
For More AP News And Telugu News