పలు శాఖల ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ABN , Publish Date - Mar 30 , 2026 | 09:08 PM
రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వాహక అధికారులు (సీఈవో)గా పదోన్నతులు కల్పించింది.
అమరావతి, మార్చి30: రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వాహక అధికారులు (సీఈవో)గా పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని అధికారులకు పదోన్నతులతోపాటు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బి. ఆర్జున్ రావుకు సీఈవోగా పదోన్నతి కల్పిస్తూ.. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగాలని ఆదేశించింది. అలాగే పి. ఉర్మిళా దేవికి సైతం పదోన్నతి కల్పిస్తూ.. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగాలని ఉత్తర్వులు జారీ చేసింది. 15 రోజుల్లోగా కొత్త బాధ్యతలు చేపట్టాలని వారిని ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజధానిలో వరుస అగ్ని ప్రమాదాలు.. నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఎస్పీ భేటీ
పీ4 కార్యక్రమం ఇచ్చిన తృప్తి మరేదీ ఇవ్వలేదు: సీఎం చంద్రబాబు
For More AP News And Telugu News