రాజధానిలో వరుస అగ్ని ప్రమాదాలు.. నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఎస్పీ భేటీ
ABN , Publish Date - Mar 30 , 2026 | 08:47 PM
రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది.
గుంటూరు, మార్చి30: రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అందుకోసం రాజధాని అమరావతిలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సమాశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతిలో భద్రతా, సీసీ టీవీ కెమెరాల ఏర్పాట్లపై ఆయా సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చించారు. మరో వైపు అమరావతిలో పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
రాజధాని ప్రాంతంలోకి వచ్చే వారి నుంచి పోలీసులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆధార్, వాహనాల నంబర్లతో పాటు వారి వివరాలను సైతం నమోదు చేస్తున్నారు. అలాగే అమరావతి ప్రాంతానికి ఏ పని మీద వస్తున్నారంటూ ప్రజలకు పోలీసులు ప్రశ్నలు సంధిస్తూ.. వారి చెప్పిన వివరాలను పోలీసులు నమోదు చేస్తున్నారు. ఇక రాజధాని ప్రాంతంలో భద్రతను సైతం ఉన్నతాధికారులు పెంచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పీ4 కార్యక్రమం ఇచ్చిన తృప్తి మరేదీ ఇవ్వలేదు: సీఎం చంద్రబాబు
ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా?: ఎమ్మెల్సీ విజయశాంతి
For More AP News And Telugu News