Share News

హోం మంత్రి అనితకు అస్వస్థత..

ABN , Publish Date - Mar 05 , 2026 | 04:06 PM

ష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అస్వస్థతకు గురయ్యారు. గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆమె కొంత అస్వస్థతకు గురయ్యారు.

హోం మంత్రి అనితకు అస్వస్థత..
Vangalapudi Anitha

అమరావతి, మార్చి 05: రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అస్వస్థతకు గురయ్యారు. గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆమె కొంత అస్వస్థతకు గురయ్యారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న వైద్యులు.. అనితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు బీపీ అధికంగా ఉందని గుర్తించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడలోని ఆసుపత్రికి మంత్రి అనిత వెళ్లారు.


స్పందించిన హోం మంత్రి..

తన అనారోగ్యంపై వస్తున్న వార్తలపై హోం మంత్రి అనిత స్పందించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేశారు. తన ఆరోగ్యంపై ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. కొద్దిపాటి అలసట కారణంగా చిన్న ఇబ్బంది కలిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత వివరణ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా

ముగిసిన రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ

For More AP News And Telugu News

Updated Date - Mar 05 , 2026 | 04:46 PM