మెగా డీఎస్సీపై వైసీపీ విషప్రచారం: దేవినేని ఉమామహేశ్వరరావు
ABN , Publish Date - May 26 , 2026 | 05:00 PM
మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. మంత్రి నారా లోకేష్‌కు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక ఫేక్ ప్రచారం చేస్తున్నారని అన్నారు.
అమరావతి: వైసీపీపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. మెగా డీఎస్సీ విషయంలో వైసీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్‌కు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక ఫేక్ ట్వీట్లు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
డీఎస్సీపై మాట్లాడే హక్కు లేదు
మెగా డీఎస్సీని పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని, భవిష్యత్తులో కూడా అదే విధంగా నిర్వహిస్తామని దేవినేని ఉమ స్పష్టం చేశారు. నిరుద్యోగులను మోసం చేసిన వైసీపీకి డీఎస్సీపై మాట్లాడే హక్కు లేదన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. ఉపాధ్యాయులను అవమానించిన వైసీపీ నేతలు ముందుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు 220కి పైగా కేసులు వేశారని ఆరోపించారు. రాష్ట్రానికి గత 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని, 22 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
'నా తెలుగుదేశం – నా బాధ్యత'
టీడీపీ మహానాడును విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తున్నాయని దేవినేని ఉమ పేర్కొన్నారు. 'నా తెలుగుదేశం – నా బాధ్యత' నినాదంతో మహానాడు నిర్వహిస్తున్నామని చెప్పారు. మండుటెండలను కూడా లెక్కచేయకుండా కార్యకర్తలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని వెల్లడించారు. మహానాడు పార్టీ భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేసే కీలక వేదిక అని ఆయన అన్నారు.
అక్రమాలు బయటపడతాయి
ఈ క్రమంలోనే 'చిన్నప్పన్న' అరెస్టుతో వైసీపీ అక్రమాలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు. వందల కోట్ల రూపాయల అక్రమాలు విచారణలో వెలుగులోకి వస్తున్నాయని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయల దందాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 2004 నుంచి జరిగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తాం: సీఎం చంద్రబాబు
గోదావరి పుష్కరాల పనుల్లో జాప్యం.. అధికారుల తీరుపై పవన్ అసహనం
Read Latest AP News