Share News

మురసు తుఫాన్.. ఏపీ ప్రజలకు అండగా కేంద్రం: అమిత్ షా హామీ

ABN , Publish Date - Nov 03 , 2026 | 11:45 AM

మురసు తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునే దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు.

మురసు తుఫాన్.. ఏపీ ప్రజలకు అండగా కేంద్రం: అమిత్ షా హామీ
Home Minister Amith shah

న్యూఢిల్లీ, నవంబర్ 03: మురసు తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునే దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఫోన్‌లో మాట్లాడి.. మురసు తుఫాన్ ప్రభావం వివరాలను తెలుసుకున్నానని తెలిపారు.


కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే ఎన్‌డీఆర్ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు క్షేత్రస్థాయిలో సహాయ చర్యలు చేపట్టి.. తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలకు అండగా నిలుస్తున్నాయని అమిత్ షా వివరించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా ద్వారా అమిత్ షా వెల్లడించారు.


ఈ రోజు ఉదయం..

మురసు తుఫాన్‌ ప్రభావంపై సీఎం చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మంగళవారం ఉదయం ఫోన్ చేశారు. రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం, జరిగిన నష్టం, సహాయక చర్యలపై సీఎం చంద్రబాబుతో మాట్లాడారు. ఆర్నబ్ తుఫాన్.. ఆ వెంటనే మురసు తుఫాన్ రావడంతో ఏర్పడిన పరిస్థితులను అమిత్ షాకు తెలియజేశారు. వివిధ జిల్లాల్లో జరిగిన పంట, ఆస్తి నష్టంపై కేంద్ర హోం మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే ఆర్నబ్ తుఫాన్‌ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని ఏపీకి పంపినందుకు హోం మంత్రికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పైవిధంగా స్పందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కూటమి మేయర్ అభ్యర్థుల హవా..

మహాపాదయాత్ర సక్సెస్.. టీ బీజేపీ చీఫ్‌ను అభినందించిన అమిత్ షా

For More AP News and Telugu News

Updated Date - Nov 03 , 2026 | 01:01 PM