ఏపీలో ఆక్వా రైతులను ఆదుకోండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ..
ABN , Publish Date - May 13 , 2026 | 07:24 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రైతుల ఇబ్బందులపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రొయ్యల ఫీడ్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రైతుల ఇబ్బందులపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రొయ్యల ఫీడ్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. రొయ్యల ఫీడ్ ధరల పెరుగుదల వల్ల రైతులపై పడుతున్న భారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ముడి పదార్థాల ధరలను నియంత్రించేందుకు కేంద్రం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆక్వా రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఫీడ్ ధరల పెరుగుదల కారణంగా రైతుల పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగిందని, ఒక్కో టన్ను ఫీడ్‌పై సుమారు రూ.25 వేల వరకు అదనపు భారం పడుతోందని లేఖలో పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రొయ్యల సాగు తగ్గే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ అవసరాలకు సరిపడా ముడి పదార్థాల లభ్యత ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. సోయాబీన్ మీల్, సోయా ఆయిల్ దిగుమతులపై సడలింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
రైతులకు అందుబాటు ధరల్లో రొయ్యల ఫీడ్ లభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. అలాగే, ఫీడ్ ధరల పర్యవేక్షణ కోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని సూచించారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గన్నవరంలో పుణె ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలు ఇవే..